E-Paper
Advertisement

‘రామాయణ’ పై వర్మ రివ్యూ… మొరిగే కుక్కలంటూ !

‘రామాయణ’ పై వర్మ రివ్యూ… మొరిగే కుక్కలంటూ !
Advertisement

RGV Ramayana Review: బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన చిత్రం రామాయణ (Ramayana). ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా సాయి పల్లవి సీత పాత్రలో నటించి సందడి చేశారు. తాజాగా ఈ మైథాలజికల్ ఎపిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా కురిపిస్తూ సెలబ్రిటీలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma)సైతం రామాయణ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

రామాయణ భక్తి చిత్రం కాదు..

ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ రామాయణ సినిమా గురించి మాట్లాడుతూ.. రామాయణ సినిమా భక్తి చిత్రం కాదని ఇదొక డివోషనల్ ఫోర్స్ అంటూ ప్రశంసించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్క నటీనటులు టెక్నీషియన్ల పట్ల కూడా ఈయన స్పందిస్తూ వారిపై వారి నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక రామాయణ గురించి వర్మ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. రామాయణం అంటే కేవలం భక్తి సినిమా కాదని అదొక పవర్ ఇందులో హీరో ఆకాశంలో తెలియాడే నీలి రంగు దేవుడు కాదు. ప్రపంచం అంతం ఎలా ఉంటుందో ముందే చూసి కూడా ధైర్యంగా ముందుకు నడిచిన ఒక ధీరుడు.

యశ్ నటన అద్భుతం…

Advertisement

ఇక్కడ శత్రువులను నాశనం చేసేది కేవలం రాజ్యం కాదు.. అలహీనతను సవాలు చేసే మానసిక స్థైర్యం అని తెలిపారు. ఇక సీత దేవి అపహరణ గురించి కూడా వర్మ స్పందిస్తూ.. సీతను తీసుకెళ్లిన తర్వాత శ్రీరాముడు ఖాళీగా ఉన్న ఆశ్రమంలో నిలబడి చూసే షాట్ అద్భుతంగా ఉందని తెలిపారు. రావణాసురుడిగా యష్ విలన్ గా కాకుండా, ఒక శక్తివంతమైన పాత్ర లాగ కనిపించారు ఆయన ముఖంలో ఎలాంటి భయం, తడబాటు కూడా లేవని తెలిపారు. ఇక ఈ సినిమాలో జటాయువు పాత్రలో నటించిన అనుపమ కేర్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు.

Advertisement

ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి లుక్స్ గురించి అలాగే ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కూడా కొంతమంది విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా పట్ల సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విమర్శల పట్ల కూడా వర్మ స్పందించారు. ఇలాంటి ఒక గొప్ప వండర్ ను క్రియేట్ చేయడానికి మీరు పడిన కష్టంతో పోలిస్తే ఈ సినిమా గురించి వస్తున్న నెగిటివిటీని పక్కన పెట్టడం కష్టం కాదని తెలిపారు. సినిమా గురించి నెగిటివ్ విమర్శలు చేసేవారు ఏనుగు ముందు మొరిగే వీధి కుక్కలతో సమానం అలాంటి వారి కామెంట్లను అసలు పట్టించుకోకూడదు అంటూ నెగిటివ్ కామెంట్లు చేసే వారిని వీధి కుక్కలతో పోలుస్తూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

Also Read: అనిరుద్ కావ్య వెడ్డింగ్.. గ్రీస్ లో ల్యాండ్ అవుతున్న స్టార్స్!

Related News

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Big Stories

Advertisement
×