E-Paper
Advertisement

Battery with food materials : ఆహార పదార్థాలతో బ్యాటరీ.. ప్రపంచంలోనే మొదటిసారి..

Battery with food materials : ఆహార పదార్థాలతో బ్యాటరీ.. ప్రపంచంలోనే మొదటిసారి..
Advertisement
Battery with food materials

Battery with food materials : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్యాటరీలు అనేవి మెరుగ్గా తయారవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కానీ అంతకంటే మెరుగైన బ్యాటరీలు తయారు చేయాలన్న ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అందులో భాగంగానే ఎన్నో కొత్త పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే ఒక కొత్త రకమైన బ్యాటరీ తయారయ్యింది. ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ఇప్పుడు ఉన్న బ్యాటరీలు అన్నింటిని మించిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటలీలోని పలువరు శాస్త్రవేత్తలు కలిసి మొదటిసారి ఆహార పదార్థాలతో ఒక బ్యాటరీని తయారుచేశారు. కేవలం ఆహార పదార్థాలతో బ్యాటరీని తయారు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ బ్యాటరీలు ఎలక్ట్రానిక్స్‌ను ఛార్జ్ చేయడంలో ఉపయోగపడతాయని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పలు బ్యాటరీ టెక్నాలజీలు కేవలం ఎలక్ట్రానిక్స్‌కు మాత్రమే కాదు.. పర్యావరణానికి కూడా హానిని కలిగిస్తున్నాయి. కానీ ఇవి వాటికి చాలా భిన్నంగా ఉంటాయని తెలిపారు.

Advertisement

హెల్త్ కేర్, ఫార్మసీ, ఫుడ్ సైన్స్.. ఇలా పలు రంగాల్లో ఈ బ్యాటరీలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ బ్యాటరీల తయారీకి ప్రకృతే స్ఫూర్తి అని తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అంతే కాకుండా ఇది పూర్తిగా ఆహార పదార్థాలతో మాత్రమే తయారు చేశామన్నారు. పైగా పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో ఉపయోగించలేదని తెలిపారు. పూర్తిగా ఆహారానికి సంబంధించిన వనరులను మాత్రమే ఇందులో ఉపయోగించామన్నారు. అలా అని ఈ బ్యాటరీ తినేది కాదని జోక్ చేశారు.

ముందుగా ఫ్యాన్సీ కేకులలో ఉపయోగించే ఒక 24 క్యారెట్ గోల్డ్ లీఫ్‌ను, ఎథిల్ సెల్యూలాయిస్‌ను కలిపి బ్యాటరీలోని కండక్టర్లను తయారు చేశారు శాస్త్రవేత్తలు. విటమిన్ బి2, క్వేర్‌సెటిన్ అనే ఆహార పదార్థాన్ని కలిపి పాజిటివ్, నెగిటివ్ ప్లేట్స్‌ను తయారు చేశారు. వోల్టేజ్‌ను క్రియేట్ చేయడం కోసం యాక్టివ్ కార్బన్‌ను ఉపయోగించారు. బ్యాటరీ సపరేటర్‌ను తయారు చేయడం కోసం సుషీలో ఉపయోగించే ఒక పదార్థాన్ని ఉపయోగించారు. చివరిగా ఆ బ్యాటరీకి కేసింగ్‌ను బీ వ్యాక్స్‌తో చేశారు. ఇలా ఈ బ్యాటరీలను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×