E-Paper
Advertisement

Benefits Of Onion : ఉల్లిపాయ ఉంటే చాలు.. బ్యూటీ పార్లర్‌ అక్కర్లేదు

Benefits Of Onion : ఉల్లిపాయ ఉంటే చాలు.. బ్యూటీ పార్లర్‌ అక్కర్లేదు
Advertisement
Benefits Of Onion

Benefits Of Onion : మనం ఎక్కువగా ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదనే సామెత వింటూ ఉంటాం.. అక్షరాలా అది నిజం కూడా. ఉల్లితో మన ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు మాత్రం ఖాయం, కానీ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో ఉల్లి చేసే మేలు అంతాఇంతా కాదు.
మన చర్మసౌందర్యాన్ని పెంచుకోవడం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ ఇంట్లోని ఉల్లిపాయని చక్కగా ఉపయోగిస్తే చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఉల్లిలోని యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. అంతేకాకుండా మచ్చలు కూడా తొలగిస్తాయి. ఉల్లిపాయ నుంచి తీసిన రసంలో ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే ముఖం మెరుస్తుంది. అంతేకాదు పిగ్మెంటేషన్‌ను కూడా ఉల్లిపాయ చక్కగా పోగొడుతుంది. పసుపులో ఉల్లిపాయ రసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. శెనగపిండిలో ఉల్లిరసం, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం తేటగా అవుతుంది. యూవీ కిరణాల వల్ల మన చర్మం దెబ్బతినకుండా ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సమర్థంగా పనిచేస్తాయి. చర్మమే కాదు పెదాల సంరక్షణలో కూడా ఉల్లి బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసం పెదాలకు పూస్తే ఎండిపోయిన పెదాలు మళ్లీ యథాతధ స్థితికి వస్తాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఉల్లిపాయ ఉండేలా చూసుకుంటే కంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×