BigTV English
Advertisement

Tirumala:- ఏడుకొండల్లో వసంతోత్సవం

Tirumala:- ఏడుకొండల్లో వసంతోత్సవం

Tirumala:- తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలకు అంతా సిద్ధమైంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా తిరుమల్లో వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ .శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 అంటే సోమవారం నుంచి ఈ నెల 5 వరకు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తిచేసింది. . సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.


ఏప్రిల్ 4న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఆ తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు.చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు

ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవం లో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మూడు రోజులపాటు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్టు గతంలోనే టీటీడీ ప్రకటించింది.టీటీడీ నడక దారి భక్తులకు ప్రారంభించిన దివ్య దర్శనం టోకెన్లకు అనూహ్య స్పందన కనిపిస్తోంది. అలిపిరి నడక మార్గంలోని గాలి గోపురం వద్దర 10వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 5వేల టోకెన్లు ఇచ్చారు.


 డోర్ వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదా…?

for more updates follow this link:-Bigtv

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×