E-Paper
Advertisement

Blood Pressure :- వెన్నుముకకు గాయం.. బీపీపై ఎఫెక్ట్..

Blood Pressure :- వెన్నుముకకు గాయం.. బీపీపై ఎఫెక్ట్..
Advertisement
Blood Pressure

Blood Pressure :- బ్లడ్ ప్రెజర్ (బీపీ).. ఈరోజుల్లో టీనేజ్ దాటిన తర్వాత చాలామందికి బీపీ అనేది అటాక్ అవుతుంది. స్త్రీ, పురుషులు అని తేడా లేకుండా యవ్వనం దాటిన వెంటనే చాలామందిని బీపీ అనే మహమ్మారి వెంటాడుతోంది. ఒక్కసారి బీపీ అనేది అటాక్ అయ్యిందంటే ఇక జీవితాంతం మందులు అనేవి ఉపయోగించాల్సిందే. అయితే బీపీ అటాక్ అవ్వడానికి ఒక కొత్త కారణాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు.

బీపీ అనేది ఎక్కువ ఉండడం మాత్రమే కాదు.. తక్కువ ఉండడం కూడా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అలాగే పలు ఆరోగ్య సమస్యలు లో బీపీకి కూడా దారితీస్తాయని వైద్యులు చెప్తున్నారు. పక్షవాతం వచ్చిన చాలామందిలో బీపీ తక్కువ శాతానికి పడిపోవడం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా వెన్నుముకకు గాయం అయిన వారిలో కూడా బీపీ శాతం పడిపోవడం అనేది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

Advertisement

వెన్నుముకకు గాయం అయిన 10 మందిలోని 9 మందికి బీపీ తక్కువ అయిపోతుందని శాస్త్రవేత్తలు గమనించారు. అందుకే వెన్నుముకలపై ప్రత్యేకంగా పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. వెన్నుముకలోని కింద భాగంతో బీపీకి చాలా దగ్గర సంబంధం ఉంటుందని వారు అన్నారు. అందుకే న్యూరో ప్రాస్థెటిక్ బారోఫ్లెక్స్ అనే పరికరంతో వెన్నుముకలోని కింద భాగాన్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నించారు. ఈ పరిశోధనలకు సంబంధించిన ఒక వ్యాసాన్ని కూడా విడుదల చేశారు.

వెన్నుముక అనేది ఒక మనిషి నిలబడడంలో అయినా, కూర్చోవడంలో అయినా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకవేళ వెన్నుముకకు ఏమైనా గాయం అయినప్పుడు బీపీని కంట్రోల్ చేసే విషయంలో మెదడు చేసే పనికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే వెన్నుముకకు గాయం అయిన వ్యక్తులు నిలబడడానికి లేదా కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు అది బీపీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వెన్నుముకకు గాయం అయినవారిలో బీపీని కంట్రోల్‌లో ఉంచే బారోరెసెప్టర్ రెఫ్లెక్స్ అనే ప్రక్రియ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

బారోరెసెప్టర్ రెఫ్లెక్స్ దెబ్బతినడం వల్ల వెన్నుముకకు గాయం అయిన వ్యక్తి కదలాలని ప్రయత్నించిన ప్రతీసారి బీపీ తక్కువ అయిపోయి.. కళ్లు తిరిగినట్టు అనిపించడం సహజం అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇలాంటి వారికి ఉప్పు ఎక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయినా కూడా చాలామందిలో ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే వెన్నుముకకు గాయం తగిలిన వారిలో బీపీని కంట్రోల్‌లో పెట్టడానికి శాస్త్రవేత్తలు ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఇప్పటికే ఒక మహిళపై దానిని ప్రయోగించి కూడా చూశారు. ఈ ఇంప్లాంట్ పరికరం ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేషెంట్లకు కూడా ఉపయోగపడేలా మెరుగుపరిచి మార్కెట్లో విడుదల చేయాలని వారు అనుకుంటున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×