BigTV English

Sleep Disturbances :- కోవిడ్ నుండి బయటపడిన వారిలో నిద్రలేమి సమస్యలు..

Sleep Disturbances :- కోవిడ్ నుండి బయటపడిన వారిలో నిద్రలేమి సమస్యలు..
Sleep Disturbances

Sleep Disturbances :- 2020లో కోవిడ్ అంటే ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలిదీసుకున్న తర్వాత కోవిడ్ ప్రభావం తగ్గిపోతూ వచ్చింది. కానీ ఇప్పటికీ ఇది పూర్తిగా అంతరించిపోలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు కోవిడ్ బారినపడిన వారిని కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఇప్పటికీ ఇబ్బంది పెడతాయని చెప్తున్నారు. అందులో ఒకటి నిద్ర సరిగా లేకపోవడం అని శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో తేలింది.


వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ అనేది చాలామంది సోకలేదు. ఒకవేళ సోకినా కూడా దాని ప్రభావం ఎక్కువగా కనిపించలేదు. కానీ కొంతమందిని మాత్రం ఈ వైరస్ ఎక్కువకాలమే ఇబ్బందిపెట్టింది. అలా ఎక్కువకాలం కోవిడ్ వల్ల ఇబ్బందిపడి, దాని నుండి బయటపడిన వారిలో నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నిద్రలేమి, పడుకున్నప్పుడు ప్రశాతంగా ఎక్కువసేపు నిద్రపోలేకపోవడం లాంటివి వారిలో తరచుగా కనిపిస్తున్నాయని అన్నారు.

కోవిడ్ వల్ల ఎక్కువ రోజులు బాధపడిన 41 పేషెంట్లలో నిద్రకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వైరస్ వల్ల ఎక్కువరోజులు ఆసుపత్రులలో గడిపిన వారు ఇప్పటికీ అలసట, ఆందోళనకు లోనవుతున్నారని తెలుస్తోంది. కోవిడ్ వల్ల, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇప్పటికే చాలామంది పలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుండగా.. నిద్రలేమి సమస్యలకు కూడా ఇదే కారణమని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.


నిద్రలేమి అనేది ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కామన్‌గా కనిపిస్తున్న సమస్య కావడంతో.. కోవిడ్‌తో దీనికి సంబంధం ఉంటుందని చాలామంది నమ్మడం లేదు. కానీ ఇదే నిజమని శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్తున్నారు. 2021 ఫిబ్రవరి నుండి 2022 ఏప్రిల్ వరకు కోవిడ్ బారిన పడిన 962 పేషెంట్లను స్టడీ చేసిన తర్వాతే శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.

ఇందులో 67.2 శాతం మంది మామూలు అలసటకు లోనయితే.. 21.8 శాతం మంది తీవ్ర అలసటకు లోనవుతున్నట్టు తెలిసింది. అంతే కాకుండా ఇందులో 41.3 శాతం మంది నిద్రకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారని తేలింది. ఇంకా ఈ విషయంలో పలు పరిశోధనలు చేసి దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×