E-Paper
Advertisement

Brain Activity:ఆక్టోపస్‌పై ప్రయోగాలు సక్సెస్.. బ్రెయిన్ యాక్టివిటీ కోసం..

Brain Activity:ఆక్టోపస్‌పై ప్రయోగాలు సక్సెస్.. బ్రెయిన్ యాక్టివిటీ కోసం..

Brain Activity:మనుషుల విషయంలోనే కాదు.. పర్యావరణం, మూగజీవుల విషయంలో కూడా ఎప్పుడు ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో అంచనా వేయడం కష్టం. అందుకే మనుషుల ఆరోగ్యం విషయంపై ఎన్ని పరిశోధనలు జరుగుతాయో, వారితో పాటు ఈ భూమిపై ఉండే ఇతర జీవులపై కూడా అనే పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా నీటిలో ఉండే ఒక జీవిపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి.

నీటిలో జీవించే ఇతర జీవులతో పోలిస్తే ఆక్టోపస్ కొంచెం భిన్నంగా ఉంటుంది. అందుకే దీనిగురించి తెలుసుకోవడానికి చాలా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. అయితే దీని బ్రెయిన్ యాక్టివిటీని స్టడీ చేయాలని శాస్త్రవేత్తలు ఎంతోకాలం నుండి ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. స్టడీ విషయంలో మాత్రం వారికి సాయం చేయలేకపోయింది. కానీ తాజాగా ఆక్టోపస్ బ్రెయిన్‌ను స్టడీ చేయడంలో సక్సెస్ అయినట్టుగా జపాన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఆక్టోపస్ మెదడులో ఎలక్ట్రోడ్స్, డేటా లాగర్‌ను పంపించడం ద్వారా దాని బ్రెయిన్ యాక్టివిటీని కనిపెట్టినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు అవి బ్రెయిన్ ద్వారా తమ ప్రవర్తనను ఎలా కంట్రోల్ చేస్తాయి అనే విషయాలు ఇప్పుడు శాస్త్రవేత్తలకు సులువుగా తెలియనున్నాయి. ఆక్టోపస్ మీద చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం వల్ల ఇతర జంతువుల బ్రెయిన్ యాక్టివిటీ గురించి కూడా ఇదే విధంగా తెలుసుకోవడచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఇతర జంతువులలాగా ఆక్టోపస్‌కు స్కల్ ఉండదు. అందుకే వాటి బ్రెయిన్ యాక్టివిటీని స్టడీ చేయడానికి ఇంతకాలం పట్టిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఆక్టోపస్‌లకు ఎనిమిది చేతులు ఉంటాయి. అవి తమ శరీరంలోని ఏ భాగమైన సులువుగా చేరుకోగలుగుతాయి. అందుకే వాటిని పరీక్షించడం కోసం వాటి చేతులకు వైర్లు పెట్టినా కూడా అవి వెంటనే వాటిని తీసేయగలుగుతాయి. అందుకే తమను పరీక్షించడానికి ఉపయోగించిన పరికరాలను ఆక్టోపస్ చర్మం లోపల అమర్చామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటివరకు డేటా లాగర్స్ అనేది కేవలం పక్షులపైనే ప్రయోగించారు శాస్త్రవేత్తలు. అవే ఇప్పుడు ఆక్టోపస్‌ల విషయంలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఇందులో ఉండే బ్యాటరీలు పూర్తిగా 12 గంటల వరకు నిర్విరామంగా రికార్డింగ్ చేయగలుగుతాయి. ఒక సర్జరీ ద్వారా డేటా లాగర్స్‌ను ఆక్టోపస్ చర్మం లోపల అమర్చి ఆ తర్వాత వాటిని నీటిలోకి వదిలారు. అయిదు నిమిషాల్లో ఆక్టోపస్ మామూలు స్థితికి వచ్చింది. ఆపై 12 గంటల పాటు ఆక్టోపస్ చేసిన ప్రతీ పని రికార్డ్ అయ్యింది. ఇలా వారి పరిశోధన సక్సెస్ అయ్యింది. అయితే ఈ స్టడీలో జపాన్‌తో పాటు ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.

Fingertip:వేలి స్పర్శతో దానిని కనిపెట్టవచ్చు..

PCR Test:ర్యాపిక్ టెస్ట్‌కంటే వేగంగా పీసీఆర్ రిజల్ట్..

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×