E-Paper
Advertisement

Manchu Manoj Marriage: మంచు మ‌నోజ్ పెళ్లి వ‌చ్చే వార‌మే!

Manchu Manoj Marriage: మంచు మ‌నోజ్ పెళ్లి వ‌చ్చే వార‌మే!

Manchu Manoj Marriage:మంచు ఫ్యామిలీకి చెందిన హీరో మంచు మ‌నోజ్ రెండో పెళ్లి గురించి కొన్నిరోజులుగా నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. దివంగ‌త పొలిటీషియ‌న్ భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా నాగ మౌనిక రెడ్డితో మంచు మ‌నోజ్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు.మ‌నోజ్‌, మౌనిక‌లు రెండు, మూడు ఈవెంట్స్‌లో జ‌త‌గా క‌నిపించ‌టంతో గుస‌గుస‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ వార్త ఈ మ‌ధ్య క‌న్‌ఫ‌ర్మ్ కూడా అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు జ‌రనుంద‌నే దానిపై వార్త‌లు ఆగ‌లేదు. అయితే ఈ వార్త‌లకు త్వ‌ర‌లోనే చెక్ పెట్టాల‌ని మంచు, భూమా ఫ్యామిలీలు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు వ‌చ్చే వారం.. అంటే మార్చి మొద‌టి వారంలో.. ప‌క్కాగా చెప్పాలంటే మార్చి 3న మ‌నోజ్‌, మౌనిక‌ల వివాహం జ‌ర‌గ‌బోతుంది. రెండు కుటుంబాల‌కు చెందినవారు, ప‌రిమిత సంఖ్య‌లోనే స్నేహితులు, శ్రేయోభిలాషుల‌ను పెళ్లికి ఆహ్వానిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై మంచు ఫ్యామిలీ ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. అయితే రెండు కుటుంబాల‌కు చెందిన‌వారు మాత్రం చాలా గుంభ‌నంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మంచు మ‌నోజ్‌కి ఇది వ‌రకే పెళ్లైంది. ప్ర‌ణ‌తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయ‌న కొన్నాళ్ల‌న‌కు మ‌న‌స్ప‌ర్ద‌ల కార‌ణంగా విడాకులు తీసుకున్నారు. అలాగే నాగ మౌనిక కూడా ఇది వ‌ర‌కే పెళ్లైంది. విడాకులు తీసుకున్నారు. మ‌నోజ్ సినీ కెరీర్‌ను గ‌మ‌నిస్తే కొన్నాళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటూ వ‌స్తున్న మ‌నోజ్‌.. రీసెంట్‌గానే వాట్ ది షిట్ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు మ‌నోజ్ ఎప్పుడొస్తారో చూడాలి మ‌రి.

Anasuya Bharadwaj: లెస్బియ‌న్ ఎక్స్‌పీరియెన్స్‌పై అన‌సూయ డేరింగ్ కామెంట్స్‌

Rashmi Gautam: రష్మీని కుక్క అంటూ నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన స్టార్ యాంకర్

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×