BigTV English

Jobs : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొత్తం పోస్టుల 4500..

Jobs : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొత్తం పోస్టుల 4500..

Jobs : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- సీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ తదితర పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2022-23 సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది.


మొత్తం 4500 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇందులో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ) పోస్టులున్నాయి. ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు.

ఉద్యోగార్థులకు టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించాలి. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.



వేతన స్కేలు

ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు పే లెవెల్‌-2 (రూ.19,900-63,200)

డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) పోస్టులకు పే లెవెల్‌-4 (రూ.25,500-81,100)

పే లెవెల్‌-5 (రూ.29,200-92,300)

డేటా ఎంట్రీ ఆపరేటర్‌, గ్రేడ్‌-ఎ పోస్టులకు పే లెవెల్‌-4 (రూ.25,500-81,100)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్‌, కాకినాడ, కరీంనగర్‌, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.01.2023
టైర్‌-1 పరీక్షలు: ఫిబ్రవరి, మార్చిలో
టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష: వివరాలు తర్వాత ప్రకటన

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×