BigTV English

ChatGPT:చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ!

ChatGPT:చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ!

ChatGPT:టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన చాట్‌జీపీటీ… కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఏ యాప్‌కూ లేనంతగా… యూజర్ల నుంచి చాట్‌జీపీటీకి విశేష ఆదరణ లభిస్తోంది. ఇంకా చెప్పాలంటే… చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది… చాట్‌జీపీటీ. 2023 జనవరి నెలలో ఏకంగా 10 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది… చాట్‌జీపీటీ.


యూబీఎస్ అధ్యయనం ప్రకారం… ప్రారంభించిన రెండు నెలల తర్వాత, జనవరిలో రోజూ సగటున కోటీ 30 లక్షల మంది చాట్‌జీపీటీని సందర్శించారు. ఇది డిసెంబర్ కంటే దాదాపు రెట్టింపు సంఖ్య. మొత్తమ్మీద జనవరి నెలలో చాట్‌జీపీటీ 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లను చేరుకోవచ్చని, ఇది చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యూజర్ అప్లికేషన్‌గా నిలిచిందని యూబీఎస్ తెలిపింది. ఇంటర్నెట్ స్పేస్‌ను అనుసరించి గత 20 ఏళ్లలో ఏ యాప్ కూడా చాట్‌జీపీటీ అంత వేగంగా ఎదగలేదని పేర్కొంది. లాంచ్ అయిన తర్వాత 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లను చేరుకోవడానికి టిక్ టాక్ కు 9 నెలలు పట్టగా, ఇన్‌స్టాగ్రామ్ కు రెండున్నరేళ్లు పట్టిందని, అదే చాట్‌జీపీటీ ప్రారంభించిన మూడో నెలలోనే ఆ స్థాయికి చేరుకుందని యూబీఎస్ వెల్లడించింది.

ఇప్పటిదాకా యూజర్లకు ఉచితంగానే అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీని… చాట్‌జీపీటీ ప్లస్ పేరుతో పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ కందికి తీసుకొచ్చింది… దాని మాతృ సంస్థ ఓపెన్ఏఐ. నెలకు 20 డాలర్లు… అంటే మన కరెన్సీలో రూ.1600లు చెల్లించి చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి… పీక్ అవర్స్ లోనూ వేగవంతమైన యాక్సెస్, రెస్పాన్స్, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ లభిస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది. చాట్‌జీపీటీ ప్లస్ ప్రస్తుతానికి అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఓపెన్ఏఐ భావిస్తోంది. అయితే… మిగతా దేశాల్లో చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చేదాకా… వినియోగదారులందరికీ ఉచిత యాక్సెస్‌ను అందించాలని కంపెనీ నిర్ణయించింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×