BigTV English

Smartphone: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ధర 7 వేల కంటే తక్కువే..!

Smartphone: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ధర 7 వేల కంటే తక్కువే..!

Smartphone: చాలామంది తక్కువ ధరలో మంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్‌ను కొనుక్కోవాలని చూస్తుంటారు. అయితే పెరిగిన ధరల కారణంగా కాస్త ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా మొబైల్ కంపెనీ స్టోర్లలో డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించినపుడు కొనుక్కుంటుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో.. అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా?..


కొత్త సంవత్సరం 2024లో స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ఆఫర్‌లతో రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు చాలా తక్కువ ధరలో ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకోనున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ కంపెనీ భారతదేశంలో ఓ కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతుంది. జనవరి 3న భారత మార్కెట్‌లో ఐటెల్ ఎ70 పేరుతో ఓ మోడల్‌ను పరిచయం చేయనుంది. ఈ మోడల్ ఫొటో, డిజైన్ కూడా వెలుగులోకి వచ్చింది.

దీని ఫీచర్లను గమనిస్తే.. ఈ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్, 12GB RAM, 256GB స్టోరేజ్‌‌ వంటి రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మోడల్‌లో డైనమిక్ బార్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాదు ఈ ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 6.6-అంగుళాల డిస్‌ప్లే, Unisoc T603 ప్రాసెసర్ ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.7490 ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇతర ఆఫర్లతో దీన్ని రూ.7వేల లోపే సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×