Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)గురించి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చిరంజీవి గురించి బాలకృష్ణ (Balakrishna)చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆయనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పని నేపథ్యంలో అఖిల భారత చిరంజీవి యువత ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు అఖిల భారత చిరంజీవి యువత సిద్ధమయ్యారు. ఇలా అభిమాన సంఘాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేయబోతున్నారనే విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అలర్ట్ అవుతూ ఫిర్యాదులు వద్దని, అది మన సంస్కారం కాదంటూ వారించారు. ఇలా మెగాస్టార్ సూచనల మేరకు అభిమానులు వెనకడుగు వేస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
ఇలా చిరంజీవి పట్ల బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో అఖిలభారత చిరంజీవి యువత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడిన సమయంలో చిరంజీవి సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఇతర దేశాలలో ఉన్న నేపథ్యంలో పత్రిక ప్రకటన ద్వారా బాలయ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను, అసలు జరిగిన నిజాలను బయటపెట్టారు. ఇక విదేశాల నుంచి చిరంజీవి రావడంతో మరోసారి ఈయనకు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. తానేమీ మాట్లాడాలనుకుంటున్నానో ఆ విషయం గురించి ఇదివరకే మాట్లాడాను అంటూ చిరంజీవి మరోసారి స్పందించారు.
ఇలా బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ ఏపీ రాజకీయాలలో కూడా ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అసలు వీరి మధ్య ఈ వివాదానికి గల కారణమేంటనే విషయానికి వస్తే… గత ఏపీ ప్రభుత్వ హయామంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ మీటింగ్ కు చిరంజీవి ప్రాతినిధ్య వహించారు. చిరంజీవి చొరవతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం సినిమా సెలబ్రిటీలు కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.
చిరంజీవికి మద్దతుగా ఆర్. నారాయణమూర్తి
ఇక ఈ విషయం గురించి ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి మాట్లాడటం వల్లే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేయలేదని కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో చిరంజీవి అభిమానులు బాలకృష్ణ మాటతీరును తీవ్రస్థాయిలో ఖండిస్తూ వచ్చారు. ఇక ఈ ఘటన పై మరొక నటుడు ఆర్ నారాయణ మూర్తి కూడా స్పందిస్తూ చిరంజీవికి మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయం ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Avika Gor: ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అవికా గోర్.. ఘనంగా మెహందీ వేడుక!