IND VS PAK Final : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని లీగ్ దశ నుంచి చెబుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే శివసేన పార్టీకి చెందిన ఓ లీడర్ ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగకూడదని నిరసన తెలుపుతూ టీవీని బద్దలూ కొట్టాడు. అలాగే బార్లలో, క్లబ్ లలో ఇండియా-పాక్ మ్యాచ్ ని పెట్టి భారీగా దండుకున్నారని ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగకూడదని.. జరిగినా మనం చూడకూడదని టీవీ బద్దలు కొట్టడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.
Also Read : Chris Woakes Retirement: ఇండియాపై సింగిల్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసిన క్రిస్ వోక్స్ రిటైర్మెంట్
వాస్తవానికి టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ ని సెప్టెంబర్ 14న లీగ్ దశలో బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేశారు. కానీ మ్యాచ్ విజయం సాధించిన తరువాత ట్రోలింగ్స్ చేసిన వారు సైతం పాకిస్తాన్ జట్టు కు టీమిండియా తగిన బుద్ది చెప్పిందని పేర్కొన్నారు. తాజాగా టీవీ బద్దలు కొట్టడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ తో ఆడకూడదని చెప్పినప్పటికీ టీమిండియా, బీసీసీఐ ఆసియా కప్ 2025లో పాల్గొన్నాయి. కానీ ట్రోఫీని మాత్రం తీసుకోలేదు. అందుకు ఓ కారణం ఉందండోయ్.. అదేంటంటే..? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టీమిండియా మాత్రం ఈ విషయంలో కాస్త వెనకడుగు వేసింది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అస్సలు ట్రోఫీ తీసుకోబోమని తేల్చి చెప్పింది.
దీంతో నఖ్వీ ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకెళ్లినట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా అయినప్పటికీ.. ట్రోఫీని అందుకోలేదు. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ ఇస్తున్న తరుణంలో… టీమిండియా దాన్ని రిజెక్ట్ చేసింది. పాక్ వ్యక్తి ఇవ్వడం ఏంటి..? అని ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బీసీసీఐ అధికారి సైకియా స్పందించారు. “పాక్ వ్యక్తి ఇవ్వడం వల్లే ట్రోఫీని మేము తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అలా అని… ట్రోఫీని వదులుకోవడం లేదని తెలిపారు. ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దాచుకోకుండా… ఇండియాకు ఆ ట్రోఫీని పంపించాలని ఆదేశించారు. లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం” అని హెచ్చరించారు సైకియా. మరోవైపు కొందరూ పాకిస్తాన్ ఆటగాళ్లను పాకిస్తాన్ దేశస్తులే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం విశేషం.
?igsh=b2d0ZDF5cHl4Zm5j