E-Paper
Advertisement

Co-Operative meals : సహపంక్తి భోజనాలు చేస్తే ఒకేసారి లేవాలా..

Co-Operative meals : సహపంక్తి భోజనాలు చేస్తే ఒకేసారి లేవాలా..
Advertisement

Co-Operative meals : పెళ్ళ్లిళ్లు, పండుగలు, శుభాకార్యాలు సమయంలో అందరూ కలిసి భోజనం చేసే సంప్రదాయంలో మారుతూ వస్తోంది. కాలంతోపాటు రూపాలు మార్చుకుంటూ వస్తోంది. ఇటీవల కాలంలో ఏ శుభకార్యానికి వెళ్లినా, భోజనాల దగ్గరికి వచ్చే సరికి ఎవరికి వారు వడ్డించుకు తినే బఫే పద్ధతే కనిపిస్తోంది. కొందరు మాత్రం సంప్రదాయాన్ని గౌరవిస్తూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బఫే భోజనాల్లో ఎవరు తిన్నారో ఏంటో తెలియదు. ప్లేస్, ఫుడ్ ఖర్చు తక్కువగా అయిపోతుందని ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు.

ఆధునిక పద్ధతిలో జరిగే భోజనాల ఏర్పాట్ల వలన, శుభకార్యానికి హాజరైన వారిలో ఎవరు భోజనాలు చేశారో … ఎవరు చేయలేదో తెలియదు. కానీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి బంధువులే వడ్డించినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆచారం ప్రకారం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు, ముందుగా భోజనం చేసినప్పటికీ అందరూ భోజనం చేయడం పూర్తయ్యేంత వరకూ పైకి లేవకూడదని అంటుంటారు. సహపంక్తిలో పెద్దవాళ్లు కూడా కూర్చోవడం చూస్తుంటారం. వాళ్లని గౌరవిస్తూ వారి భోజనం పూర్తయ్యేంత వరకూ మిగతా వాళ్లు అలాగే వేచి వుండటం జరుగుతుంది. ఈ విధానంలో ఆచారం వెనుక ఒక పరామర్థం కూడా ఉంది.

Advertisement

సాధారణంగా సహపంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు అందరి శరీర భాగాలలోని విద్యుత్ ఒకే రకమైన నియంత్రణను కలిగి వుంటుంది. ఈ కారణంగా సహపంక్తిలో నుంచి ఎవరైతే ముందుగా పైకి లేస్తారో వారు ఇతరుల శక్తిని గ్రహిస్తారు. అలాగే అందరికన్నా చివరన భోజనం చేసి పైకి లేచినవారు తమ శక్తిని ఎక్కువగా కోల్పోతారని అంటారు. ఈ విధానాన్ని నియంత్రించడం కోసమే సహపంక్తి చేసినప్పుడు అందరూ ఒకేసారి పైకి లేవడమనే ఆచారాన్ని మన పూర్వీకులు పాటిస్తూ వచ్చారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×