Moto G67 Power vs Vivo Y31 vs Redmi 15| దేశంలో 5జీ బడ్జెట్ ఫోన్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి నెలా బడ్జెట్ ధరలో కొత్త మోడల్స్ మంచి ఫీచర్లతో విడుదల అవుతున్నాయి. ఇటీవలే విడుదలైన మోటో G67 పవర్ 5G నేరుగా వివో వై31 5G, రెడ్‌మీ 15 5G తో పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్లు కూడా అందుబాటు బడ్జెట్ లోనే మంచి ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. అయితే కొత్త ఫోన్ కొనాలనుకునే బడ్జెట్ జీవులు ఈ మూడింటిలో ఏది బెస్ట్ చూద్దాం.
మోటో జీ67 పవర్ లాంచ్ ధర రూ.15,999. ఇది 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్. వివో Y31 5G కొంచెం చీప్ – రూ.14,999కి 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్. రెడ్‌మీ 15 5G ధర కూడా రూ.14,999. కానీ ఈ ధరకు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఈ మూడింటి ధరలు చూస్తే.. రెడ్‌మీ కాస్త ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ ఇస్తుంది కాబట్టి ఇదే బెటర్ ఆప్షన్.
మోటో G67లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా ఉంటుంది. వివో Y31లో 6.68 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, అదే 120హెచ్‌జెడ్ రేట్. రెడ్‌మీ 15 అతి పెద్ద స్క్రీన్ – 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ప్యానెల్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ సూపర్ స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే క్వాలిటీలో రెడ్‌మీ అన్నింటి సూపర్.
మోటో G67లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌సెట్ ఉంది. మిడ్-రేంజ్‌లో దీని పెర్ఫామెన్స్ బెస్ట్. వివో Y31లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 – సాధారణ టాస్కులకు సరిపోతుంది. రెడ్‌మీ 15లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 – పవర్, ఎఫిషియెన్సీ బ్యాలెన్స్ బాగుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్‌కి మోటో, రెడ్‌మీ మంచివి.
మోటో G67 పవర్‌లో భారీ 7,000 mAh బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. వివో Y31లో 6500 mAh బ్యాటరీ, 44వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. రెడ్‌మీ 15లో కూడా 7,000 mAh బ్యాటరీ, 33వాట్ ఛార్జింగ్ + 18వాట్ రివర్స్ ఛార్జింగ్. బ్యాటరీ లైఫ్‌లో మోటో, రెడ్‌మీ టాప్. కానీ ఛార్జింగ్ స్పీడ్‌లో వివో బెటర్.
మోటో G67: 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్, 32ఎంపీ సెల్ఫీ – బెస్ట్ ఆల్-రౌండర్.
వివో Y31: 50MP మెయిన్ + 0.08MP సెకండరీ (పెద్దగా ఉపయోగం ఉండదు ), 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
రెడ్‌మీ 15లో సింపుల్ 50MP మెయిన్, 8MP సెల్ఫీ.
కెమెరా విషయంలో మోటో క్లియర్ విన్నర్.
ఈ మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతాయి. మోటో – క్లీన్ హెల్లో యూఐ (యాడ్స్ లేకుండా). వివో లో అయితే ఫన్‌టచ్ ఓఎస్ 15, రెడ్‌మీలో హైపర్‌ఓఎస్ 2.0 (ఎక్కువ ఫీచర్స్, కొంచెం బ్లోట్‌వేర్). సాఫ్ట్‌వేర్ ప్రిఫరెన్స్ విషయంలో మీ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
మోటో జీ67 పవర్: క్లీన్ సాఫ్ట్‌వేర్, లాంగ్ బ్యాటరీ, మంచి కెమెరా కావాలనుకునేవారికి
రెడ్‌మీ 15: బెస్ట్ డిస్‌ప్లే, స్మూత్ పెర్ఫార్మెన్స్, వాల్యూ ఫర్ మనీ
వివో వై31: ఫాస్టెస్ట్ ఛార్జింగ్, బడ్జెట్ ఆప్షన్.
మీ బడ్జెట్, మీకు ముఖ్యమైన ఫీచర్ (డిస్‌ప్లే/బ్యాటరీ/కెమెరా) ఆధారంగా ఎంచుకోండి. రెడ్‌మీ 15 ఓవరాల్ బెస్ట్ వాల్యూ అనిపిస్తుంది, కానీ మీ అవసరాలు చూసుకోండి!
Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే