Mowgli: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల(Suma Kanakala) కుమారుడు రోషన్ కనకాల(Roshan Kanakala) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోషన్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే రోషన్ బబుల్ గమ్ అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చా రు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నటన పరంగా రోషన్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా రోషన్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
కలర్ ఫోటో సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సందీప్ రాజ్ తదుపరి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రోషన్ కనకాల,బాలీవుడ్ నటి సాక్షి మడోల్కర్ జంటగా మోగ్లీ సినిమా(Mowgli Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు . ఈ సినిమా డిసెంబర్ 12 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి టీజర్ విడుదల చేయడానికి చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ 12వ తేదీ ఈ సినిమా టీజర్ విడుదల కాబోతుందని తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించారు.
ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. సుమ కనకాల కుమారుడి కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్టీఆర్ రాజీవ్ కనకాల ప్రాణ స్నేహితులనే విషయం తెలిసిందే. ఇలా తన స్నేహితుడి కొడుకు కోసం ఎన్టీఆర్ తన వంతు సాయం చేస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విలన్ పాత్రలో బండి సరోజ్…
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది ఇక డిసెంబర్లో ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బండి సరోజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈసారి రోషన్ కనకాల మంచి హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుసగా అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు.ఇది వరకే ఈ సినిమా కోసం నాని తన వంతు సాయం చేశారు. నాని వాయిస్ ఓవర్‌తో “ది వరల్డ్ ఆఫ్ మొగ్లీ” అనే గ్లింప్స్ ను విడుదల చేయగా తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగటం విశేషం.
Also Read: Global Trotter : SSMB 29 గ్లోబ్ ట్రాటర్ థీమ్ సాంగ్ విన్నారా… హైప్ పెంచుతున్న జక్కన్న!