Globe Trotter: మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి (Rajamouli)కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనే ఆతృత ప్రతి ఒక్క అభిమానులను ఉంది. ఈ నవంబర్ 15వ తేదీ ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఈ కార్యక్రమానికి సంబంధించి భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేయబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఈయన కుంభ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మరి కొద్ది రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పై సినిమాపై అంచనాలు పెంచుతూ చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) కు సంబంధించి ఒక థీమ్ సాంగ్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించగా, చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. నటి శృతిహాసన్ (Shruthi Hassan)ఈ పాట ఆలపించారు. ఈనెల 15వ తేదీ ఈ సినిమాకి సంబంధించిన వేడుక జరుగుతున్న నేపథ్యంలోనే ఈ థీమ్ సాంగ్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగే .. మేఘాన్ని శ్వాసిస్తూ పెనుగాలై వెను తిరిగేలే”అంటూ సాగిపోయే ఈ పాట అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటకు కీరవాణి సంగీతం హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచుతుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఇప్పటికే చిత్ర బృందం హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతున్న ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రాజమౌళి వెల్లడించలేదు. అయితే ఈ సినిమా టైటిల్ గ్లింప్ విడుదల చేయడం కోసం ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలోనే ఏర్పాటు చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని అలాగే ఈ కార్యక్రమానికి మీడియా వారు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వెంట్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుక కోసం యావత్ సినీ ఇండస్ట్రీ తో పాటు మహేష్ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Renuka Shahane: ప్రతినెల స్టైఫెండ్ ఇస్తా..నాతో ఉంటావా.. నటి రేణుకా షహానేకు చేదు అనుభవం!