BigTV English

Antaratma : అంతరాత్మ మాట వినాలా..వద్దా

Antaratma : అంతరాత్మ మాట వినాలా..వద్దా
Antaratma

Antaratma : ప్రతీ ప్రాణిలోను అంతరాత్మ అంతర్వాణి అంతః శక్తి అనేవి ఉంటాయి. అయితే కొందరు నిక్షిప్త శక్తిని గమనించరు. గమనింపుకి వచ్చినా.. పట్టించుకోరు. పట్టించుకున్నా పరిశీలింరు. మనం చాలాసార్లు చాలా విషయాల్లో మనకు తెలియకుండానే అంతర్వాణి మాటల్ని వింటుంటాం. ఈ అంతర్వాణినే అంతరాత్మ అని అంటాం. మనం చేసే మంచి పనికీ చెడ్డపనికీ మనలని అంతరాత్మ స్పందిస్తూ సలహాలు ఇస్తూ ఉంటుంది. మహాయోగులు దీనిని హృదయ కమలం అని చెబుతారు.


ఎంత చెడ్డవాని అంతరాత్మమైనా మంచే చెబుతుంది తప్పు ఎప్పుడూ చెడు చెప్పదు. మనల్ని ఒకే రోజున 8మంది బిక్షగాళ్లు ధర్మం అని అడుగుతారు. మనం లేదు లేదంటూనే ఒకరిద్దరికి ధర్మం చేస్తాం. అంతమందిని కాదనీ ఏ ఒక్కరికో, ఇద్దరికే ఎందుకు ధర్మం చేశాం. అంటే మనలోని అంతర్వాణి మాటను అంగీకరించామన్నమాట.

మనం చేసే కొన్ని తప్పుడు పనులకు మనలోని అంతర్వాణి మనల్ని హెచ్చరిస్తూ వద్దు వద్దని చెబుతూ ఉంటుంది. కానీ మనం లెక్క చేయం. మన అంతరాత్మ మాట విననందుకు ఫలితం తర్వాత తెలుస్తుంది. ఏడుస్తాం. బాధపడతాం. రక్షించే వారి కోసం ఎదురుచూస్తాం. ఎంతో నష్టపోతాం. అంతర్వాణిని ధిక్కరించిన ఫలితమిది.


మన పెద్దవాళ్ల ఏదైనా పనిచేసే ముందు కాస్త ఆలోచించరా అంటుండం మనకు గుర్తుండే ఉంటుంది. ముందుకు దూకబోయే ముందు కాస్త అంతర్వాణిని గమనించు. నీకు నువ్వే రాజువు అవుతావు. విజయం సాధిస్తావు. మీరేపని చేయబోతున్నా, మహత్కార్యానికి మొదటి అడుగు వేయబోతున్నా, మరొకరి చంపేద్దామని అనుకున్నా కాసిని నీళ్లు తాగి ఒక పదినిమిషాలు కనులు మూసి అంతర్వాణి చెప్పేది వినండి.

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×