Whiskey Sales: దేశంలో మద్యం వినియోగం అనే సరికి ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల వైపు పడుతుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అధికంగా మద్యం వినియోగించడమే అసలు కారణం. దేశంలో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో సగానికి పైగా వాటా దక్షిణాది రాష్ట్రాలదే. ఈ విషయాన్ని కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్-CIABC వెల్లడించింది.
దేశవ్యాప్తంగా విస్కీ వినియోగంలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అమ్మకాల్లో 17 శాతం ఆ రాష్ట్రం నుంచి వస్తున్నట్లు పేర్కొంది. తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక ఏడాదికి దేశవ్యాప్తంగా మొత్తం ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలలో 58 శాతం దక్షిణాది రాష్ట్రాలదే. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలు మద్యం అమ్మకాల్లో జోరును కొనసాగించాయి.
దేశవ్యాప్తంగా 40.17 కోట్ల విస్కీ కేసుల అమ్మకాలు జరిగాయి. అందులో దక్షిణాది రాష్ట్రాలు 58 శాతం పైమాటే. ఆయా రాష్ట్రాల్లో 23.18 కోట్ల కేసులు అమ్ముడైనట్లు వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే దక్షిణాదిలో ఒక శాతం వినియోగం పెరిగింది. అత్యధికంగా 17 శాతం వాటాతో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం.. తెలంగాణ-3.71 కోట్ల కేసులు, ఆంధ్రప్రదేశ్- 3.55 కోట్ల మద్యం కేసులు అమ్ముడైనట్టు తేలింది. దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల అమ్మకాల వాటా కలిపితే దాదాపు 9 శాతం. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల వాటా చాలా తక్కువ. కేవలం 20 శాతం మాత్రమే. ఉత్తరప్రదేశ్- 2.50 కోట్ల కేసులతో ముందులో ఉంది.
ALSO READ: కరూర్ తొక్కిసలాట ఘటన.. దర్యాప్తులో జస్టిస్ అరుణ జగదీశన్
ఇక యూపీలో 6 శాతం పెరిగింది. జార్ఖండ్, రాజస్థాన్, పుదుచ్చేరిలలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఓవరాల్‌గా పరిశీలిస్తే యూపీ ఆరో స్థానం, రాజస్థాన్-9, ఢిల్-10వ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత హర్యానా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 39.62 కోట్ల ఐఎంఎఫ్ఎల్ కేసులు అమ్ముడయ్యాయి. ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 40.17 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో స్వల్పంగా వృద్ధి నమోదు అయ్యిందనే చెప్పవచ్చు.