Asia Cup 2025 Prize Money : ఆసియా కప్ 2025 ఫైనల్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా 9వ సారి ఆసియా కప్ ను గెలుచుకుంది. కానీ ఈసారి కప్ ను ఇప్పటివరకు ముద్దాడలేదు. పాకిస్తాన్ పై ఆసియా కప్ 2025 ఫైనల్స్ గెలిచినప్పటికీ టీమిండియా మాత్రం ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. మరోవైపు ఆసియా కప్ 2025 విజేతకు ప్రైజ్ మనీ 2.6 కోట్లు అయితే.. రన్నరప్ పాకిస్తాన్ కి 1.3 కోట్లు ఇచ్చారు. పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి ఏసీసీ చైర్మన్ గా ఉండటంతో అతని చేతుల మీదుగా టీమిండియా ట్రోఫీ తీసుకునేందుకు, ప్రైజ్ మనీ తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.
Also Read : IND Vs PAK : టీమిండియాను ఓడించేందుకు పాక్ కుట్రలు… గాయమైనట్లు నాటకాలు ఆడి.. అచ్చం రిషబ్ పంత్ నే దించేశాడుగా
అయితే ఆసియా కప్ 2025 ప్రైజ్ మనీ 2.6 కోట్లు అయితే బీసీసీఐ మాత్రం టీమిండియా కి రూ.21కోట్లు ఇచ్చింది. ఇక అంతకు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు రూ.58 కోట్లు, అలాగే టీ-20 వరల్డ్ కప్ గెలిచినందుకు రూ.125 కోట్లు ఇచ్చింది బీసీసీఐ. ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.1.5 కోట్లు ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్ గా నిలిచిన శ్రీలంక కి రూ.82 లక్షలు గెలుచుకుంది. ఈ సారి ఆసియా కప్ 2025 కి డబుల్ పెంచడం విశేషం. బీసీసీఐ టీమిండియా భారీగా ప్రైజ్ మనీ ఇవ్వడంతో టీమిండియా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రపంచంలోకెళ్లా అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే..? అది బీసీసీఐ అనే చెప్పవచ్చు. బీసీసీఐ తరువాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అత్యంత ధనికమైనది. దీంతో ఆటగాళ్లను ప్రోత్సహించడంలో బీసీసీఐ ముందుంటుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ మధ్య కాలంలో ఫార్మాట్ ఏదైనా సరే అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు టెస్టుల్లో.. ఇటు వన్డేల్లో ఇలా ఏ ఫార్మాట్ లో అయినా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆసియా కప్ 2025 పాకిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో టీమిండియా సత్తా చాటింది.
రింకూ విన్నింగ్ షాట్..
ఆసియా కప్ 2025లో ప్రతీ మ్యాచ్ లో ఆకట్టుకున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ కావడం గమనార్హం. అలాగే మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కూడా కేవలం 12 పరుగులు మాత్రమే చేసి కాస్త నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్ వర్మ ఔట్ అయిన తరువాత ఓవర్ కే ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ కావడంతో పాకిస్తాన్ జట్టు అంతా సంబురాలు జరుపుకుంది. పాకిస్తాన్ విజయం సాధించిందనేలా వ్యవహరించింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ విజయం సాధించేంత వరకు టీమిండియా కి అండగా నిలబడ్డాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సంజూ శాంసన్ 24, శివమ్ దూబే 33 వికెట్లు పడకుండా కీలక ఇన్నింగ్స్ ఆడారు. 19వ ఓవర్ చివరి బంతికి దూబే ఔట్ కావడంతో టీమిండియా కాస్త టెన్షన్ పడింది. ఆ తరువాత తిలక్ వర్మ ఓ సిక్స్ బాదడంతో మ్యాచ్ టీమిండియా వైపు మళ్లింది. అప్పటివరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. చివర్లో రింకూ సింగ్ వచ్చి విన్నింగ్ షాట్ ఆడాడు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది.