Bed : ఈ రోజుల్లో పిల్లలతోపాటు పెద్దోళ్లు కూడా మంచం మీద భోజనాలు, టిఫిన్లు చేసేస్తుంటారు. టీవీల చూస్తూ లాగించేస్తుంటారు. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం
భోజనం మంచం మీద తింటే అది రోగాలకు కారణమవుతుందట. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుందట. కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరవవుతుందట. భోజనం చేసేటప్పుడు దేవుడిని ప్రార్థించాలట. మన దేహం దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని భావిస్తున్నాం కాబట్టి. ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు
మంచం మీద కూర్చుని కొందరు కాళ్లు ఊపుతూ కనిపిస్తుంటారు. అలా కూర్చుని కాళ్లుపుతూ కనిపిస్తే గతంలో పెద్దోళ్లు అలా చేయకూడదని చెప్పేవారు. ఎందుకంటే అలా చేయడం అరిష్టమని వారించేవాళ్లు. కాళ్లూపడం వల్ల తెలియకుండానే అరిష్టం తగులుతుంది. నరాల్లో బలహీనత వచ్చి వీర్యస్కలనం కూడా ఒక్కోసారి జరుగుతుంది. వాతవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
రేతస్సు బలహీనపడి సుఖసంసారం గాడి తప్పే అవకాశం ఉంది. పది, పదిహేను రోజులు దాటినా ఆ విషయం గురించి ఆలోచనే రాదు. ఎప్పుడైతే శృంగారం పట్ల ఉత్సాహమూ, కోరిక పోతాయో శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఆలోచనలు వేదాంతపరమైన విషయాలపైకి వెళ్లి అక్కడా ఇమడలేక ఒకలాంటి నిరాశ వంటిది ఆవహిస్తుంది. తద్వారా అనేక అపజయాలు ఎదురవుతాయి.