Kantara 2 Premiers:రిషబ్ శెట్టి.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కాంతార చాప్టర్ 1. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. కానీ ఈ ప్రీమియర్ షో లను క్యాన్సిల్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి కారణం ఆశించినంతగా ఆక్యుపెన్సీ లేకపోవడంతోనే ఇలా దేశవ్యాప్తంగా కూడా ప్రీమియర్ షోలు రద్దు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అన్ని షోలు అక్టోబర్ 2 ఉదయం నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అటు ఏపీలో ఇవాళ రాత్రి 10 గంటల ప్రీమియర్ షోలు కూడా రద్దు కానున్నాయి. ఏది ఏమైనా ఈ విషయం అభిమానులకు భారీ షాక్ కలిగించే అంశం అని చెప్పవచ్చు. మరి అక్టోబర్ 2 దసరా సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు.
ALSO READ:Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!