Saeed Ajmal Cheque : ఆసియా కప్ 2025 ఫైనల్ లో టీమిండియా విజయం సాధించినందుకు బీసీసీఐ రూ.21కోట్లు రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆటగాళ్ల గురించి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ అజ్మల్ గతంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “మేము 2009 టీ-20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత ప్రధానమంత్రి గిలానీ ఒక్కో ఆటగాడికి రూ.25లక్షల చెక్కు ఇచ్చారు. మేము ఎంతో సంతోషపడ్డాం. అప్పట్లో రూ.25లక్షలు అంటే మామూలు విషయం కాదు మాకు. కానీ అవి చెక్ బౌన్స్ అయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు” అని వెల్లడించారు.
Also Read : Ind vs SL: వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ… శ్రీలంక చిత్తు చిత్తు
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇటీవలే టీమిండియా కు ప్రపంచ ఛాంపియన్స్ షిప్, టీ-20 వరల్డ్ కప్, ఆసియా కప్ మూడింటికి కలిపి దాదాపు రూ.200 కోట్లకు పైగా ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే.. అది బీసీసీఐనే. అందుకే టీమిండియా ఆటగాళ్లకు భారీగా డబ్బులు ఇస్తుంటుంది. ఇక ఆసియా కప్ లో భారత్ తో వరసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయినందుకు పాకిస్తాన్ జట్టుకు పీసీబీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా విదేశీ టీ-20 లీగ్స్, టోర్నమెంట్ లో ఆడేందుకు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల(NOC) ను రద్దు చేసింది. తిరిగి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా (NOCలను హోల్డ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఈ నిర్ణయానికి ప్రత్యేక కారణం మాత్రం ఏమీ చెప్పలేదు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా పై ఓటమి చెంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదరా..? అంటూ తలలు పట్టుకున్నారు.
మరోవైపు వాస్తవానికి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ అజ్మల్ చెప్పినట్టు 2009 టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కష్టపడి పైనల్ కి చేరుకొని.. పైనల్ లో శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. దీంతో తొలిసారి టీ-20 వరల్డ్ కప్ ముద్దాడిన పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ ప్రధాని గిలానీ ఒక్కో ఆటగానికి రూ.25 లక్షలు చొప్పున చెక్కు ఇవ్వడం.. ఆ చెక్కు బౌన్స్ కావడం పాక్ ఆటగాళ్ల దురదృష్టం అనే చెప్పాలి. మరోవైపు వరల్డ్ కప్ తరువాత వెంటనే పాక్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. దీంతో వాళ్లు నిరాశ చెందారో ఏమో తెలియదు కానీ.. శ్రీలంక చేతిలో పాక్ జట్టు ఘోరంగా ఓడిపోవడం విశేషం. 2009 వరల్డ్ కప్ టీ-20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 138 పరుగులు చేసింది. 139 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు తొలి 8 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ తరపున షాహిద్ అఫ్రిది అజేయంగా 54, కమ్రాన్ అక్మల్ 37, షోయబ్ మాలిక్ అజేయంగా 24 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. విజయం సాధించామన్న సంతోషంతో ఉండగా.. ప్రభుత్వం బాగానే విజయానికి ప్రతిఫలం దక్కిందనుకున్న ఆటగాళ్లకు కొద్ది రోజుల్లోనే చెక్కు బౌన్స్ కావడంతో కొద్ది రోజుల్లోనే నిరాశ చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.