Film industry:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో తెలియదు. ఎవరిని పెళ్లి చేసుకుంటారో కూడా తెలియదు. అయితే అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు సంతోషంగా జీవిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిస్తే.. మరికొన్ని జంటలు అనూహ్యంగా విడిపోయి ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు, సినీ నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) , ప్రముఖ గాయని సైంధవి (Saindhavi ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇక తాజాగా వీరికి చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
జీవీ ప్రకాష్ కుమార్ – సైంధవి దంపతులకు విడాకులు మంజూరు..
2013లో జీవీ ప్రకాష్ కుమార్ తన స్కూల్ స్నేహితురాలు అయిన సైంధవిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కానీ 12 ఏళ్ల వివాహం బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్న వీరు.. విడాకుల కోరుతూ ఈ ఏడాది చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో మార్పు వస్తుందని, కలిసిపోతారని ఫ్యామిలీ కోర్టు వీరికి కౌన్సిల్ కూడా ఇచ్చినా వీరు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఇప్పుడు వీళ్లకు విడాకులు మంజూరు చేసింది చెన్నై ఫ్యామిలీ కోర్టు.
ALSO READ:Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?