Big Stories

Srilanka Boats Enter India : భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ శ్రీలంక బోట్లు

Sri Lanka Boats Enter India : భారతీయ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిన రెండు శ్రీలంక ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది పట్టుకున్నారు. శ్రీలంక ఫిషింగ్ బోట్లతో పాటు భారతీయ EEZలో ఫిషింగ్ చేస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం కాకినాడకు ఎస్కార్ట్ చేసింది. శ్రీలంక ఫిషింగ్ బోట్లు నవంబర్ 10న కళింగపట్నం నుండి 175 NMల దూరంలో పట్టుకున్నారు.

- Advertisement -

చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, పత్రాలు లేకుండా SL ఫిషింగ్ ఓడల ద్వారా భారతీయ సముద్ర జలాల్లో చేపలు పట్టడం మొదలుపెట్టారు. 1981 , MZI చట్టం భారతీయ EEZలో విదేశీ నౌకలు చేపలు పట్టడం, వేటాడటం నేరంగా పరిగణిస్తారు. నిందితులను కాకినాడలో మెరైన్ పోలీస్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, కస్టమ్స్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులంతా సంయుక్తంగా విచారిస్తున్నారు. తదుపరి చర్యల కోసం మత్స్యకార బోట్లు, సిబ్బందిని ….. మెరైన్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, మెరైన్ పోలీసులకు అప్పగిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News