OTT Movie : థ్రిల్లర్ జానర్ అందరూ ఇంట్రెస్టింగా చూస్తుంటారు. అయితే దీనికి కొంచెం కామెడీ టచ్ ఇస్తే, ఆడియన్స్ చూపు సినిమాపైనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ సినిమా, కామెడీ థ్రిల్లర్ గా వచ్చి ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘వాల్వి’ (Vaalvi) 2023లో వచ్చిన మరాఠీ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా. దీనికి పరేష్ మొకాషి దర్శకత్వం వహించారు. ఇది 2023 జనవరి 13న థియేటర్లలో విడుదలై, 2023 ఫిబ్రవరి 24 నుంచి ZEE5లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో స్వప్నిల్ జోషి (అనికెట్), అనితా కెల్కర్ (అవాని), షివాని సుర్వే (దేవికా)ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 46 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 8.3/10 రేటింగ్ పొందింది.
అనికెత్ , అవాని అనే భార్యాభర్తలు, తమ వైవాహిక జీవితంలో సంతోషంగా లేరు. అవానికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడూ భర్తతో గొడవలు పడుతుంది. అనికెత్ ఆమెతో విసిగిపోయి, డివోర్స్ కావాలనుకుంటాడు. కానీ అందుకు అవాని ఒప్పుకోదు. అనికెత్ కి దేవికా అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో హ్యాపీ లైఫ్ కావాలని ప్లాన్ చేస్తాడు. అనికెత్, దేవికా కలిసి అవానిని చంపడానికి ఒక డేంజరస్ ఐడియా వేస్తారు. అవానిని చంపి, అది సూసైడ్ లాగా చూపించాలనుకుంటారు. వాళ్ళు ఒక ప్లేస్‌కి అవానిని తీసుకెళ్లి, పాయిజన్ ఇచ్చి ఆమెను చంపేస్తారు. సినిమా ఇక్కడ నుంచి టెన్షన్‌గా మారుతుంది.
అనికెట్, దేవికా అవాని శవాన్ని దాచడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ వస్తుంది. శవం మిస్సింగ్ అవుతుంది. అనికెత్ కి ఒక అపరిచితుడు కాల్ చేస్తాడు. నీవు చంపిన శవం మాకు దొరికింది, డబ్బు ఇవ్వు లేకపోతే పోలీస్‌కి చెబుతాం అని బెదిరిస్తాడు. అనికెత్ , దేవికా పానిక్ అవుతారు. శవం ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడ ఉంది? అనే సందేహంలో పడతారు. వాళ్ళు శవం కోసం వెతుకుతూ పోలీస్, ఫ్రెండ్స్ మధ్య గందరగోళంలో చిక్కుకుంటారు. అయితే చివర్లో పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. దేవికా, అవాని ప్లాన్ చేసి ఈ డ్రామా ఆడతారు. ఇది తెలిసి ఒక్కసారిగా అనికెత్ షాక్ అవుతాడు. వీళ్ళు ఎందుకు ఈ డ్రామా ప్లే చేస్తారు ? ఎలా దొరికిపోతారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా