BigTV English

Viral Video: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పిల్లలను తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అదే సమయంలో కఠిన సందర్భాలను తట్టుకుని పెరిగేలా తయారు చేస్తారు. తాజాగా ఓ తండ్రి ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ, కొంత మంది అసలు విషయం తెలియకుండా అతడి మీద విమర్శలు చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…


కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన తండ్రి

సోషల్ మీడియా ఉపయోగించే వారికి ‘ది బకెట్ లిస్ట్ ఫ్యామిలీ’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తారు. ప్రయాణంలో భాగంగా బోలెడు సాహసాలు చేస్తుంటారు. తాజాగా అలా చేసిన ఓ పని నెటిజన్ల నుంచి విమర్శలకు కారణం అయ్యింది. అయితే, ఈ వివాదంపై గీ తన వివరణ ఇచ్చారు. గీ కొద్ది రోజుల క్రితం ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో గీ తన కొడుకు కాలిహాన్‌ తో ఎత్తైన కొండపై నిలబడి ఉంటాడు. అతడిని ఎత్తుకుని నూరుగా పక్కనే ఉన్న సముద్రంలోకి విసిరేస్తాడు. ఆ చిన్న పిల్లవాడు భయంతో వణికిపోతాడు. కానీ, నీళ్లలో పడిన వెంటనే గీ కూడా తనతో పాటు దూకి.. కొడుకుతో కలిసి ఈతకొడతాడు.


ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు

ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లాడు భయపడుతుంటే అలా విసిరేస్తారా? అంటూ మండిపడ్డారు. చాలా మంది వీక్షకులు గీ చర్యను విమర్శించారు. తాజాగా ఈ ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. తల్లిదండ్రులుగా తమ పిల్లలను జాగ్రత్తగా పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాము ఎంత ప్రాక్టికల్ గా ఉంటామో, అంత జాగ్రత్తగానూ ఉంటామని చెప్పారు. “నేను షేర్ చేసిన వీడియోకు చాలా మంది నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ పెట్టడం పట్ల కొంత విచారంగా భావిస్తున్నారు. ఎందుకంటే, మా పిల్లలు మీరు అనుకున్నంత ఒత్తడికి లోనయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మేం వారి పక్కనే ఉన్నాం. ప్రతి పిల్లవాడు చాలా భిన్నంగా ఉంటాడు.  అందుకే, మేం మా పిల్లలకు జంప్‌ ను ఎలా క్లిఫ్ చేయాలో నేర్పించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ మా మొదటి ప్రాధాన్యత భద్రత. రెండవది  కఠినమైన పనులు చేసేలా నేర్పించడం. మూడవది ఆనందించండం”  అని గీ పోస్ట్‌ లో రాశారు.

‘ది బకెట్ లిస్ట్ ఫ్యామిలీ’ గురించి..

‘ది బకెట్ లిస్ట్ ఫ్యామిలీ’ ఇటీవల 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ ఫ్యామిలీ గత దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన అంశాలను పంచుకుంది. థ్రిల్ సీకింగ్ కంటెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా, ఈ ఫ్యామిలీ సొరచేపలతో ఈత కొట్టడం, టెన్డం స్కూబా డైవింగ్, ఇటలీలో స్లెడ్డింగ్, ఇతర సాహసోపేతమైన అనుభవాల వీడియోలను పంచుకుంటుంది. ఈ ఫ్యామిలీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

Read Also: అమ్మ చనిపోయిందంటూ లీవ్ అడిగిన ఉద్యోగి.. బాస్ రిప్లైతో ఒక్కసారిగా షాక్!

Related News

Viral Video: సంస్థలు వేరైనా అందరూ ఒక్కటై.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టిన ఫుడ్ డెలివరీ బాయ్స్.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: సరస్సులో పర్యాటకుల పడవ ప్రయాణం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఏనుగు..

Food Waste Countries: ఆహార పదార్థాల వృధా దేశాల టాప్ 10 జాబితా ఇదే.. రెండో స్థానంలో భారత్

Viral News: అమ్మ చనిపోయిందంటూ లీవ్ అడిగిన ఉద్యోగి.. బాస్ రిప్లైతో ఒక్కసారిగా షాక్!

Viral Video: 12 ఏళ్ల బాలిక జడ కొప్పులో ఉడుత గూడు, వీడియో వైరల్

Viral Video: డెలివరీ బాయ్ ను చేజ్ చేసిన 10 మంది పోలీసులు.. అసలు ఏమైందంటే?

Viral Video: గర్బా ఈవెంట్ లో ముద్దులు.. క్షమాపణ చెప్పి దేశం విడిచి వెళ్లిపోయిన జంట!

Big Stories

×