BigTV English

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss 9:బిగ్ బాస్.. తెలుగులో 9వ సీజన్ కి సంబంధించి 4వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఈసారి కేవలం నామినేషన్స్ లోకి ఆరుగురు మాత్రమే రావడం గమనార్హం. ఇక ఆ నామినేషన్స్ లో కూడా వారిపైనే టార్గెట్ చేయడం ఇక్కడ సంచలనంగా మారింది. మరి ఈ నాలుగవ వారానికి సంబంధించి నామినేషన్స్ లోకి ఎవరు వచ్చారు? ఎవరెవరు కంటెస్టెంట్స్ టార్గెట్ అయ్యారు? మరి మీరు ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అవుతారా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ముగిసిన నామినేషన్ ప్రక్రియ..

బిగ్ బాస్ సీజన్ 9లో మొదటివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrasti Varma)ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కామనర్ మర్యాద మనీష్ (Maryada Manish) ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం కూడా మరో కామనర్ ప్రియా శెట్టి (Priya Shetty)ఎలిమినేట్ అయింది. ఇప్పుడు నాల్గవ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయ్యారు ఆరు మంది హౌస్ సభ్యులు. అందులో కూడా కామనర్స్ ఉండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ప్రతి వారం కూడా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. కానీ ఈసారి అలా పెట్టకుండా ఇమ్యూనిటీ కోసం గేమ్స్ ఆడించారు. ఇందులో తనూజ, సుమన్ శెట్టి గెలిచి నామినేషన్స్ నుంచి తప్పుకున్నారు. అలాగే కెప్టెన్ పవన్ కూడా ఎలాగో నామినేషన్స్ లో ఉండడు కాబట్టి ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

నామినేషన్స్ లోకి వచ్చిన ఆరుగురు వీరే..


మరొకవైపు నామినేషన్స్ ప్రక్రియ నుండి తప్పించుకోవడానికి మరో గేమ్ పెట్టగా.. అందులో ముగ్గురు చొప్పున మూడు జట్లుగా విడగొట్టి వాళ్లతో గేమ్ ఆడించారు. ఇందులో రెండుసార్లు ఎల్లో టీం గెలిచింది. ఆ ఎల్లో టీం లో సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా ఉన్నారు. అయితే రాము.. సంజనను నామినేట్ చేస్తే.. సుమన్ రీతుని నామినేట్ చేశాడు. అలా మొత్తంగా చూసుకుంటే మొత్తం 6 మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు. రీతు చౌదరి, సంజన , హరిత హరీష్ , ఫ్లోరా షైనీ, శ్రీజ, దివ్య నామినేషన్స్ లోకి వచ్చారు. వీళ్ళల్లో దివ్య గత వారమే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చింది. నిజానికి శ్రీజ కూడా గతవారం నామినేట్ అయ్యింది. కానీ కెప్టెన్ పవన్ వల్ల ఆమె సేవ్ అయింది. ఈసారి మాత్రం నామినేషన్స్ నుంచి తప్పించుకోలేకపోయింది.

ALSO READ:Drugs Case: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. ఏకంగా 35 కోట్ల విలువ.. ఎవరంటే?

వారిపైనే వేటు..

ఇకపోతే నామినేషన్ లిస్ట్ చూస్తే ఈసారి శ్రీజ బయటకి వచ్చే అవకాశం ఉందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే దివ్య కాకుండా మిగిలిన నలుగురు కూడా ఇప్పటికే నామినేషన్స్ లోకి వచ్చి సేవ్ అయ్యారు. కాబట్టి వాళ్లకి ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంది.దాంతో సెలబ్రిటీలు ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. ఇక ఎటు చూసినా సరే అటు శ్రీజ, ఇటు దివ్య ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి కూడా కామనర్ పైనే వేటు పడబోతోంది అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో..

Related News

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Bigg Boss 9: వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు.. ట్విస్ట్ అదిరింది.. నామినేషన్స్ నుంచి వారిద్దరు సేవ్

Bigg Boss 9: మళ్లీ రచ్చ మొదలుపెట్టిన సంజన.. తినడానికి బిక్ష అడుక్కోవాలా?.. పాపం తనూజ

Bigg Boss 9 Promo: వారధి కోసం పోరాటం.. నెగ్గేదెవరు?

Big Stories

×