Kurnool : కొంతమంది పోలీసుల తీరు.. ఆ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తీసుకొస్తుంది. లంచాల మత్తులో జోగుతూ పోలీస్ వ్యవస్థకే కలంకం తీసుకువస్తున్నారు. పేదలని కూడా చూడకుండా వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు కొంతమంది అవినీతి ఖాకీలు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే.. అన్యాయాలకు బరితెగిస్తున్నారు. ఓ కేసు విషయంలో బాధితుల నుంచి నెలనెలా మాముళ్లు తీసుకుంటూ.. అడ్డంగా బుక్కైయ్యాడు ఓ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన..కర్నూలు జిల్లా కోసిగిలో చోటు చేసుకుంది.
కోసిగిలో ఓ బుడ్డోడి దగ్గర పోలీసు డబ్బులు తీసుకుంటున్న సన్నివేశం మీడియా కంటా పడింది. పోలీస్టేషన్లో పని చేస్తున్న ఓ పోలీసు sbi బ్యాంకు సమీపంలో పది, పదుహైదు నిమిషాల పాటు వేచి ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ తీరుపై అనుమానం వచ్చి ఓ వ్యక్తి వీడియో కెమెరాను అన్ చేసి ఉంచాడు. కాసేపటికే ఓ బుడ్డోడు వచ్చి తన జేబులో నుంచి డబ్బులు తీసి ఆ కానిస్టేబుల్ కు ఇచ్చాడు. కానిస్టేబుల్ వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి బుడ్డోడిని పిలిచి డబ్బులు ఎందుకు పోలీస్ కు ఇచ్చావ్ అంటూ ప్రశ్నించగా.. నెల నెలా పోలీసులకు మామూళ్లు ఇస్తామ ఆ బుడ్డోడు కరాకండిగా తెల్చిచెప్పాడు. దీనిపై అతను మరింత ఆరా తీయగా వీస్తు పోయే అంశం బయటపడింది.
గతంలో మా కుటుంబానికి సంబంధించిన వారిపై కేసు ఉందని, అప్పటి నుంచి పోలీసులు నెల నెలా మాముళ్ల కోసం మా అవ్వకు ఫోన్ చేస్తారని ఆ బాలుడు చెప్పుకొచ్చాడు. మా అవ్వ నాకు డబ్బులు ఇచ్చి పోలీసులకు ఇవ్వమని.. ఇస్తేనే నేను ఇచ్చాను అని తెలిపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు పోలీస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కొంతమంది పోలీసుల వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందని పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.