Delhi Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? సీఎం చంద్రబాబు-మంత్రి లోకేష్ ఒకేసారి హస్తినకు వెళ్లడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు వైసీపీలో వణుకు మొదలైంది? లిక్కర్ కేసులో ఈడీ ఎవర్నైనా అరెస్టు చేయనుందా? హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో ఎలాంటి సంకేతాలు వచ్చాయి? ప్రస్తుతం వీటిపై ఏపీలో నేతలు చర్చించుకుంటున్నారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మంగళవారం బిజీ బిజీగా గడిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ ఫ్యూచర్ తన ప్లాన్ ఏంటన్నది డాక్యుమెంట్ రూపంలో సీఐఐ సదస్సులో వివరించారు. నవంబర్‌లో విశాఖ వేదికగా జరగనున్న సదస్సు రావాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. సీఎం. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.
చివరగా మంగళవారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఇరువురు మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లిక్కర్ కేసు వ్యవహారంపై ప్రధానంగా చర్చించినట్టు ఢిల్లీ పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి.
అభివృద్ధి అనేది కాసేపు పక్కన బెడితే.. ప్రధానంగా ఏపీలో రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. లిక్కర్ కేసుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావడం ఒకెత్తయితే.. ఇంకోవైపు ఈడీ దిగడం కీలక పరిణామం. వీటిపై సమావేశంలో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆఫ్ ద రికార్డులో నేతల మాట.
ALSO READ: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీగా వర్ష సూచన
ఇటీవల మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం తర్వాత ఈడీ-సీబీఐ చాలా నగరాల్లో దాడులు చేసిన విషయం తెల్సిందే. అందులో చాలావరకు లిక్కర్ గుట్టు బయటపడినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చే నేతలెవరు? ఎంతమంది వస్తున్నారు? ఆ అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
వీలైతే బుధవారం ఉదయం ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కావచ్చు. సమయం లేకుంటే ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకుంటారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో పెన్షన్ల కార్యక్రమానికి హాజరవుతారు. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో చూడాలి.