Idli Kottu OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అంటూ విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు ఈరోజు(అక్టోబర్ 1 2025) థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ (Nithya Menon) ధనుష్ తో ఈ సినిమా ద్వారా మరోసారి జతకట్టింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘తిరు’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డులు కూడా అందుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై ఇప్పుడు అభిమానులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి అభిమానుల అంచనాలను ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయం తెలియాలి అంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే.
ఇకపోతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా పేరు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. ఇకపోతే ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది కాబట్టి ఈ సినిమా రిజల్ట్ ని బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ:Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?