Big Stories

భోజనానికి ముందు కాళ్లు కడుక్కోవాలా…?

అన్నం పరబ్రహ్మస్వరూపం . మనిషి మాటలు నేర్చి , వివేకం తెలిసి వికసించి విజ్ఞాతనవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనదని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపాహారాల ఇష్టత లేని వారికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేని వానికి సంతుష్టత ఉండదు.

- Advertisement -

ఆహారాన్ని సక్రమంగా తీసుకోనివానికి ఏ కోరికలు ఉండవని భగవద్గీత చెబుతోంది. పాత రోజుల్లో భోజనశాలను ప్రతీ రోజు ఆవుపేడతో అలికి సున్నంతో ముగ్గులు వేసే వారు. దీని వల్ల సూక్ష్మక్రిములు భోజన సమయంలో భోజనశాలలోకి వచ్చేవి కావు. మనుషులకు హాని చేసే సూక్ష్మక్రిములను చంపే ఆయుధం ఫెన్సిలిన్ ఆవుపేడలో ఉంది. అందుకే కిందపడిన ఆహారా పదార్థాలను తినవద్దని చెప్పడానికి ఉన్న ఆచారం కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఆహార పదార్ధాలు కింద పడితే శుభ్రం చేసిన తర్వాత మళ్లీ పేడతో అలికి శుభ్రపరిచే వారు.

- Advertisement -

మనకు శక్తిని ప్రసాదించి , మన ప్రాణాలను కాపాడి చైత్యనవంతుల్ని చేసే నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించడంలో తప్పులేదు. పూజించడం నేరము కాదు. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యమే చెడిపోతుంది. కాళ్లు కడుక్కోకపోతే ఇంటిల్లిపాది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పోతుంది. బయట నుంచి ఇంటికి వచ్చిన వాళ్లు లోపలికి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోమనే పద్దతి కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు, స్నేహితులు కానీ వచ్చినప్పుడు కాళ్లు కడుక్కోమని నీళ్లు అందించడానికి కారణం కూడా ఇదే. కాళ్లు కడిగిన తర్వాతే తాగడానికి నీళ్లు ఇస్తారు. ఇది మన సంప్రదాయం.

తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. నిలబడి అన్నం తినడం, నీళ్లు తాగడం కూడా శ్రేయస్కరం కాదు.ఇప్పుడు ఈ రోజుల్లో కాళ్లు కడుక్కోవటం కాదు గదా..కనీసం చేతులు కడిగే తీరికే ఉండడం లేదు. పరుగులు తీస్తున్నాం. అవసరమైతే చెంచాలతో తినేస్తూ బతికేస్తున్నాం. ఈ బిజీ లైఫ్ లో ఆహారాన్ని గౌరవించే ఓపిక, తీరిక ఉంటుందా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News