BigTV English
Advertisement

Flying Bus : గాల్లో ఎగిరే బస్సు..లాస్ ఏంజిల్స్ నుంచి షాన్ ఫ్రాన్సిస్కోకు గంట ప్రయాణం

Flying Bus : గాల్లో ఎగిరే బస్సు..లాస్ ఏంజిల్స్ నుంచి షాన్ ఫ్రాన్సిస్కోకు గంట ప్రయాణం

Flying Bus : అప్పటిదాకా రోడ్డు మీద వేగంగా వెళ్తున్న బస్సు… ఉన్నట్టుండి రివ్వును గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది. కాసేపు గాల్లో తిరిగాక… మళ్లీ రోడ్డుపైన వాలిపోతే అది నిజంగా అద్భుతమే కదా! ఇదేమీ ఊహకాదు. హాలీవుడ్ సినిమా సీన్ అంతకన్నా కాదు. భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి రానున్న ప్రయాణం. అవును… టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందింది మరి. ఎగిరే మినీ బస్సును ప్రయోగాత్మకంగా రూపొందించింది అమెరికాకు చెందిన కలెకొనా కంపెనీ. ఇది న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ. ఇది పేరుకే మినీ బస్సు… కానీ ఇందులో ఒకేసారి 40 మంది ప్రయాణించే ఏర్పాట్లున్నాయి. ఇక ఈ బస్సును నడిపే పైలట్ తో కలుపుకుంటే మొత్తం 41 సీట్లుంటాయి. ఈ బస్సు 350 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే 563 కిలోమీటర్ల రేంజ్ లో ట్రావెల్ చేస్తుంది. దీని గరిష్ట పేలోడ్ సామర్థ్యం 4 వేల 535 కిలోలు. అంటే 45 క్వింటాళ్లు. ఈ లెక్కన ఒక్కో మనిషి 100 కిలోల బరువున్నా… ఈ మినీ బస్ 45 మందిని మోసుకెళ్లగలదన్నమాట.
ఈ మినీ బస్ కు ఎనిమిది ఫ్యాన్లను అమర్చారు. అవి బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. జర్నీలో ఒకవేళ బ్యాటరీల ఛార్జింగ్ అయిపోతే… అప్పటికప్పుడు ఫుల్ గా ఛార్జింగ్ చేసిన బ్యాటరీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ మినీ ఏర్ క్రాఫ్ట్ లాస్ ఏంజిల్స్ నుంచి షాన్ ఫ్రాన్సిస్కోకు ఒక గంటలో చేరుకోగలదు. ఈ రెండు సిటీల మధ్య దూరం 347 మైళ్లు అంటే 559 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరం మినీ ఏర్ బస్ ప్రయాణించే రేంజ్ కంటే 4 కిలోమీటర్లు తక్కువే.
దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది కలెకొనా కంపెనీ. అందులో మినీ బస్ గాల్లో చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఎత్తైన భవంతులను తప్పించుకుంటూ… మేఘాలపైకి దూసుకెళ్తుంది. తెల్లని మేఘాలపైనా వేగంగా ప్రయాణిస్తుంది. దీంతోపాటే వాహనం పనితీరును కూడా అందులో వివరించారు.


Tags

Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×