Prabhas Marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రభాస్(Prabhas) ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న ఈయన కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు కానీ వ్యక్తిగత విషయంలో మాత్రమే అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టు తీస్తే అందులో ప్రభాస్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఇలా పెళ్లి వయసు దాటిన ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి (Marriage)చేసుకోకుండా సినిమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు ప్రభాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతుంటారు.
ప్రభాస్ పెళ్లి కోసం పూజలు?
ఇకపోతే ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శ్రావణమాసం కావడంతో ఈమె తన కుటుంబ సభ్యులతో కలిపి ద్రాక్షారామంలోని భీమ లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితోనేనా?
ప్రభాస్ పెళ్లి కోసం అలాగే తమ పిల్లల పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు చేశామని అయితే మీరందరూ కోరుకున్న విధంగానే త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని ఈమె శుభవార్త తెలిపారు. ఈ ఏడాదైనా కావచ్చు లేదా మరో ఏడాది అయినా కావచ్చు అంటూ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారా? అనే ప్రశ్న కూడా ఎదురయింది అయితే ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినా? లేదా వేరే ఎవరైననా? అనే విషయాల గురించి క్లారిటీ లేదు కానీ త్వరలోనే పెళ్లి మాత్రం జరగబోతోంది అంటూ శ్యామలాదేవి ఈ సందర్భంగా వెల్లడించారు.
వరుస సినిమా పనులలో ప్రభాస్..
ఇలా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి అమ్మాయి ఎవరు అనేది క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసినా, త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగబోతుందనే విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా శ్యామలాదేవి పలు సందర్భాలలో ప్రభాస్ పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ కావడంతో ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటారా? లేకపోతే చిన్న గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకుంటారా? అంటూ మరి కొంతమంది అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి స్పష్టత రావాలి అంటే స్వయంగా ప్రభాస్ ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.
Also Read: Chaitanya Reddy: కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేము.. సినిమా బిజినెస్ కాదు!