BigTV English

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Jos Butler :   ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా ఆయన తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. “రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్” అని జాస్ బట్లర్ ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫోటోను ఆయన తాజాగా షేర్ చేశారు. చిన్నప్పటి నుంచి తండ్రి జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీటి పర్వంతమయ్యాడు బట్లర్. తన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అతను కంటతడి పెట్టుకోవడం చూసి.. మిగతా వారు రోధించడం విశేషం. ఇక బట్లర్ తండ్రి మరణించడానికి కారణాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. బట్లర్ ధైర్యంగా ఉండాలని కాంక్షిస్తూ పలువురు ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.


Also Read : Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

 క్రికెట్ కి బట్లర్ గుడ్ బై..? 


జోస్ బట్లర్ ధైర్యంగా ఉండాలంటూ సహచర ఆటగాళ్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషాద సమయంలో కూడా బట్లర్ ది హండ్రెడ్ టోర్నమెంట్ లో తన జట్టు అయిన మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడారు. అతని తండ్రికి నివాళిగా, జట్టు సభ్యులందరూ బ్లార్ ఆర్మ్ బ్యాండ్ లు ధరించారు. ఈ మ్యాచ్ లో నాలుగు బంతులను ఎదుర్కొన్న బట్లర్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మరోవైపు తన తండ్రి మరణించడంతో క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల జరిగిన టీ-20  బ్లాస్ట్ 2025లో యార్క్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో బట్లర్ తన టీ-20 కెరీర్ లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా.. ఇంగ్లాండ్ తరపున అలెక్స్ హేల్స్ తరువాత రెండో ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పేలవమైన ప్రదర్శన తరువాత బట్లర్ టీ-20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

అద్భుతమైన ఫామ్ లో

అతని స్థానంలో హ్యారీ బ్రూక్ కొత్త కెప్టెన్ గా నియమితులయ్యాడు. వన్డే క్రికెట్ లో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు జోస్ బట్లర్ పేరు మీదనే ఉంది. 2015లో పాకిస్తాన్ జట్టు పై కేవలం 46 బంతుల్లోనే బట్లర్ ఈ ఘనత సాధించాడు. బట్లర్ ఒక అద్భుతమైన వికెట్ కీపర్.. బ్యాట్స్ మెన్. అంతేకాదు.. కెప్టెన్ గా కూడా తన ప్రతిభ ను చాటుకున్నాడు. ఇంగ్లాండ్ ను రెండు వరల్డ్ కప్ లలో విజేతగా నిలిపి.. మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు 2018లో బట్లర్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. 2025 సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు బట్లర్. ఈ సీజన్ ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ లో కొనసాగాడు. మరోవైపు బట్లర్ 2017లో లూయిస్ వెబ్బర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరూ కుమార్తెలు కూడా ఉన్నారు.

 

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×