BigTV English

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Retail Real Estate: మన దేశంలో రీటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ బలమైన ఊపు అందుకుంది. 2025 మొదటి ఆరు నెలల్లోనే టాప్ 7 నగరాల్లో మొత్తం 5.7 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 69% వృద్ధి. ఈ గణాంకాలు జేఎల్‌ఎల్‌ (JLL) రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ తాజా రిపోర్ట్‌లో వెల్లడయ్యాయి.


ఈ వృద్ధిలో ముందంజలో ఉన్నా ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు 

2025 రెండో త్రైమాసికం (Q2)లో మాత్రమే ఢిల్లీ-ఎన్‌సీఆర్ 0.53 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ రికార్డ్ చేసింది. బెంగళూరుకు తర్వాతి స్థానంలో నిలిచినా, ఈ రెండు నగరాలే దేశ వ్యాప్తంగా లీజింగ్‌లో సగానికి పైగా వాటా సాధించాయి. ఎన్‌సీఆర్‌లో ప్రధాన ఆకర్షణ – ఫుడ్ అండ్ బెవరేజ్ (F&B) రంగం. ఇక్కడి మొత్తం లీజింగ్‌లో 22% ఈ రంగం వాటా.


AIPL డైరెక్టర్ ఇషాన్ సింగ్ మాట్లాడుతూ – “Experiential retail మళ్లీ బలంగా వస్తోంది. గురుగ్రామ్‌లోని Golf Course Extension Road వంటి ప్రీమియం హై-స్ట్రీట్ డెస్టినేషన్లు కేవలం షాపులు కాదు… వీటిలో రిక్రియేషన్, ఎంగేజ్‌మెంట్ జోన్లు, సౌకర్యవంతమైన పార్కింగ్ వంటి సదుపాయాలతో కలిపి బ్రాండ్లు ప్రత్యేక వాతావరణం సృష్టిస్తున్నాయి. ధనిక మైక్రో మార్కెట్లు ఉన్న గురుగ్రామ్, నోయిడాలలో బ్రాండ్ల డిమాండ్ సహజం” అని చెప్పారు.

నాణ్యమైన రీటైల్ స్పేస్ లభ్యత కూడా ఈ వృద్ధికి కారణం

దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కొత్త మాల్స్ సరఫరా గత ఏడాదితో పోలిస్తే 165% ఎక్కువ. ఎన్‌సీఆర్ ప్రాంతం ఈ కొత్త సరఫరా వల్ల పెద్ద లాభం పొందింది. అయితే Q2లో Q1తో పోలిస్తే 15% తక్కువ కొత్త మాల్ హ్యాండోవర్ జరిగింది, కానీ మొత్తంగా ట్రెండ్ మాత్రం బలంగా కొనసాగుతోంది. ఇప్పటికే H1లో లీజింగ్ కార్యకలాపం గత ఏడాది మొత్తం వాల్యూమ్‌లో 70% కవర్ చేసింది.

SPJ గ్రూప్ చైర్మన్ పంకజ్ జైన్ మాటల్లో – “ఇది సీజనల్ స్పైక్ కాదు… ఇది కొత్త నార్మల్. బ్రాండ్లు భారత రీటైల్ పొటెన్షియల్‌ను మళ్లీ అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా NCRలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొనుగోలు శక్తి, లైఫ్‌స్టైల్ ప్రిఫరెన్సులు అన్నీ కలిసొచ్చాయి. ఇకపై డెస్టినేషన్ మాల్స్, ఇంటిగ్రేటెడ్ హై-స్ట్రీట్ కాన్సెప్ట్స్ రెండవ దశ వృద్ధిని నడిపిస్తాయి” అని అన్నారు.

Q2లోనే 13 అంతర్జాతీయ బ్రాండ్లు భారత్‌లోకి అడుగుపెట్టాయి. వాటిలో సగానికి పైగా F&B రంగానికి చెందినవే. NCR ఈ లాంచ్‌లకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. కారణం? అధిక డిస్పోజబుల్ ఇన్‌కమ్, విభిన్న ఆహార సంస్కృతి, మరియు కూర్చుని భోజనం చేసే కొత్త అనుభవాల కోసం పెరుగుతున్న డిమాండ్. ఈ రోజుల్లో యువత గ్లోబల్ ఫ్లేవర్స్, ఫ్యాషన్ కోరుకుంటోంది. అందుకే బ్రాండ్లు చిన్న ట్రయల్ స్టోర్స్ కాకుండా నేరుగా ఫ్లాగ్‌షిప్ ఔట్‌లెట్లు NCRలోనే తెరుస్తున్నాయి.

Omaxe గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయెల్ మాటల్లో..

NCR వంటి కాన్వాస్ ఏ నగరం ఇవ్వదు. ప్రధాన మార్కెట్లు స్యాచురేట్ కావడంతో, ఫరీదాబాద్ వంటి శాటిలైట్ టౌన్లు కొత్త అవకాశాలను ఇస్తున్నాయి. పెద్ద ల్యాండ్ పార్సెల్స్ అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ బ్రాండ్లు మరింత ఇమర్షివ్ కస్టమర్ అనుభవం ఇవ్వగలుగుతున్నాయి. ఇక షాపింగ్ కేవలం కొనుగోలు కాదు… అది ఒక లీజర్ యాక్టివిటీగా మారుతోంది” అన్నారు.

Ambience Malls డైరెక్టర్ అర్జున్ గెహ్లోట్ – “రీటైల్ నిర్వచనమే మారుతోంది. రీటైలర్లు ప్లగ్-అండ్-ప్లే వాతావరణం కోరుతున్నారు. షాపర్లు ఒకే చోట వినోదం, సౌకర్యం, డిస్కవరీ కోరుతున్నారు. ఇక plain vanilla మాల్స్ రోజులు ముగిశాయి. ఇప్పుడు మాల్ inspire చేయాలి. AI loyalty systems, టెక్-ఎనేబుల్ fittings, గ్రీన్ బిల్డింగ్స్, హైబ్రిడ్ ఫార్మాట్స్ అన్నీ డిమాండ్‌లో ఉన్నాయి” అని అన్నారు.

రాబోయే ఆరు నెలల్లో మరో 5.9 మిలియన్ చదరపు అడుగుల కొత్త రీటైల్ స్పేస్ ప్రారంభం కానుంది. దీంతో ఈ సంవత్సరం మొత్తం లీజింగ్ 10 మిలియన్ చదరపు అడుగుల మార్క్ దాటే అవకాశం ఉంది.
ఇది జరిగితే… భారత రీటైల్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే బలమైన సంవత్సరం అవుతుంది.మరి NCR? పోటీలో మాత్రమే కాదు… ముందుండి నడిపిస్తోంది!

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×