BigTV English

Chaitanya Reddy: కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేము.. సినిమా బిజినెస్ కాదు!

Chaitanya Reddy: కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేము.. సినిమా బిజినెస్ కాదు!

Chaitanya Reddy: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ కార్మికులు(Cini Workers) పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతూ సమ్మె(Strike) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తమకు 30% వేతనాలు పెంచాలని డిమాండ్లు చేస్తూ సమ్మెను నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులు ఆయన ఈ సమస్యకు పరిష్కారం రాని నేపథ్యంలో ఎన్నో సినిమాలు షూటింగ్ పనులు ఆగిపోవడంతో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు నిర్మాతలు అందరూ తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మికుల డిమాండ్లకు ఎందుకు అంగీకరించలేదు? అసలు ఇండస్ట్రీలో నిర్మాతలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.


కరోనా తర్వాత నిర్మాతలకు నష్టాలే…

ఈ సందర్భంగా నిర్మాత చైతన్య రెడ్డి(Chaitanya Reddy) మాట్లాడుతూ.. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఏ ఒక్క నిర్మాత కూడా లాభాలను అందుకోవటం లేదు. నిర్మాతలు కూడా ఎవరు సంతోషంగా లేరని తెలియజేశారు. మీకు ఆధారాలతో సహా ఒక సినిమాకు ఎంత వస్తుందనే విషయాలను బయటపెడతామని వెల్లడించారు.  నష్టాలు వస్తున్న సినిమాలు చేయటానికి కారణం సినిమాని ఒక బిజినెస్ లాగా చూసి చేయడం లేదని సినిమాలు అంటే ఫ్యాషన్ తో చేస్తున్నామని, నష్టాలు వచ్చిన నిర్మాతలు భరిస్తున్నారని చైతన్య రెడ్డి తెలిపారు.


భూమిపై పెట్టుబడి పెడితే లాభాలు…

డబ్బు కోసమే అయితే సినిమాలు చేయాల్సిన పనిలేదని భూమిపైన పెట్టుబడిగా పెడితే రెండింతల లాభాలు వస్తాయని కానీ డబ్బు కోసం కాదు సినిమాలంటే ఇష్టంతోనే 99 శాతం మంది నిర్మాతలు సినిమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే నిర్మాతలు ఎంత కష్టపడాలనే విషయాలు మా సినిమాలకు పనిచేస్తున్న కార్మికులను అడిగితేనే తెలుస్తుంది. ఒక సినిమా విడుదలవుతుంది అంటే హీరోలకు, హీరోయిన్లకు, కార్మికులకు కూడా వేతనాలు వస్తున్నాయి కానీ నిర్మాతకు ఎలాంటి వేతనాలు ఉండవని, ఇటీవల కాలంలో సినిమాలు సక్సెస్ అందుకోలేక నిర్మాతలు ఇబ్బందులలో ఉన్నారని వెల్లడించారు.

ప్రభుత్వంతో సంప్రదింపులు…

ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలు ఎదుర్కొంటున్న పరిస్థితులను కార్మికులు అర్థం చేసుకోవాలని వారు అడుగుతున్న డిమాండ్లను నెరవేర్చే పరిస్థితులలో నిర్మాతలు లేరని తెలిపారు. ఇలా కార్మికుల డిమాండ్లను తాము నెరవేర్చలేము కానీ తొందర్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుందని చైతన్య రెడ్డి వెల్లడించారు. ఇలా చిన్న సినిమాల నిర్మాతలు అందరూ కూడా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక సినిమా చేయడం కోసం పడే కష్టాల గురించి వివరించారు అయితే మరోవైపు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులతో ప్రభుత్వాలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొరికి సమ్మెను విరమిస్తారా లేదంటే తమ డిమాండ్లు నెరవేరేవరకు కార్మికులు ఆందోళన చేపడతారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Brahmanandam: తండ్రిగా మారిన బ్రహ్మానందం రెండో కొడుకు.. ఫోటోలు వైరల్!

Related News

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..

Parada Movie: ఓపెన్ ఛాలెంజ్ చేసిన డైరెక్టర్.. అనుపమపై అంత నమ్మకమా?

Hansika Motwani: విడాకుల రూమర్లపై మౌనం వీడిన హన్సిక… ఎన్నో పాఠాలు నేర్పిందంటూ!

Nidhhi Agerwal: అయ్యో.. పాపం నిధిని ఎంతగా ఆడుకున్నారు.. అది ప్రభుత్వ వాహనం కాదా?

Big Stories

×