Brian Lara : వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా బ్యాటింగ్ గురించి చెబితే ఎంతైనా తక్కువ. అప్పట్లో ఏ క్రికెట్ లో అయినా లారా రికార్డుల మోత మోగించేవాడు. ముఖ్యంగా 2004లో ఇంగ్లాండ్ పై 400 స్కోర్ చేసి నాటౌట్ గా నిలవడం విశేషం. ఇది ప్రపంచ రికార్డు అనే చెప్పాలి. లారా పలుమార్లు టెస్ట్ క్రికెట్ లో టాప్ ర్యాంకు సాధించాడు. టెస్ట్ క్రికెట్ అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా 501 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇలా క్రికెట్ లో పలు రికార్డులను సృష్టించాడు. తాజాగా లారా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!
వెస్టిండీస్-పాకిస్తాన్ మ్యాచ్ లో లారా..
ప్రస్తుతం వెస్టిండీస్-పాకిస్తాన్ మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు జరిగాయి. తొలి వన్డేలో పాకిస్తాన్ జట్టు విజయం సాధించగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1 తో సమంగా నిలిచాయి. ఆగస్టు 12న మూడో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో బ్రియాన్ లారా మ్యాచ్ ని వీక్షిస్తూ ఆసక్తికరంగా కనిపించాడు. ముఖ్యంగా ఇద్దరూ అమ్మాయిల మధ్య లారా మ్యాచ్ ని వీక్షించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ లారా పై సోషల్ మీడియా లో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అందులో లారా కి ప్రత్యేక స్థానం
ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ దిగ్గజాల్లో వెస్టిండీస్ స్టార్ బ్రియాన్ లారా కు ప్రత్యేక స్థానం ఉంది. షాట్ సెలక్షన్ విషయంలో దూకుడుగా ఉండే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చక్కని ఫుట్ వర్క్ తో ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. కవర్ డ్రైవ్ లు, పుల్ షాట్లు ఆడటంలో దిట్ట. అన్నింటికి మించి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లారా ఆత్మవిశ్వాసంతో ఉండటం.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను మరింత భయపెట్టేది. అందుకే అతడిని స్లెడ్జ్ చేయాలంటే వాళ్లు వణికిపోయేవారు. అనవసరంగా లారా జోలికి వెళ్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తమ పనిని పూర్తి చేసుకొని వెళ్లేవారు. టీమిండియా కూడా లారాను స్లెడ్జ్ చేసే విషయంలో భయపడేదట. టీమిండియా వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లినప్పుడు లారా కు అంతటి ప్రాముఖ్యం ఉండేది. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కమాట కూడా అనవద్దని టీమిండియా సమావేశంలో నిర్ణయించారు. తనకు తానుగా అవుటయ్యేంత వరకు వేచి చూడాలని చెప్పేవారు.
https://www.facebook.com/share/p/1B34h8zjNu/