BigTV English

Flying car in China : చైనాలో ‘ఫ్లయింగ్ కార్’.. మొదటి టెస్ట్ పూర్తి..

Flying car in China : చైనాలో ‘ఫ్లయింగ్ కార్’.. మొదటి టెస్ట్ పూర్తి..


Flying car in China : ఒకప్పుడు మనిషి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లాలంటే నడుచుకుంటూ వెళ్లేవాడు. కానీ మెల్లగా నడవడం కష్టం అనుకున్నాడో ఏమో.. ఒకచోట నుండి ఇంకొక చోటికి ప్రయాణించడం కోసం తనకంటూ ఒక బండిని తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా అప్పటి ఎడ్లబండ్ల నుండి ఇప్పటి విమానం వరకు ఎన్నో రకాలుగా మనుషులు ప్రయాణించే విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎగిరే కార్ కూడా మానవాళి ప్రయాణానికి సాయం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎన్నో విధాలుగా మర్పులు చెందింది. కార్లు, బైక్‌లు అనేవి సరిపోవని ఎలక్ట్రిక్ కార్లను, బైక్‌లను తయారు చేశారు. అంతే కాకుండా ఎన్నో మార్పులతో మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ కార్ కూడా సరిపోదని ‘ఫ్లయింగ్ కారును’ తయారు చేసింది చైనాకు చెందిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇప్పటికే చైనాలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ.. ఇతర దేశాల ఇండస్ట్రీ స్పీడ్‌తో పోటీపడడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే అందరికంటే ముందుగా ఫ్లయింగ్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.


నార్త్‌వెస్ట్ చైనాలోని నింగ్జియా ప్రాంతంలో మొదటి ఫ్లయింగ్ కార్ టెస్ట్ ఫ్లైట్ జరిగింది. ఈ ఫ్లయింగ్ కార్ అనేది కేవలం రవాణా విషయంలోనే కాకుండా టూరిజంకు కూడా కొత్త ఊపునిస్తుందని చైనా నమ్ముతోంది. ఈ ఫ్లయింగ్ కారులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే సౌలభ్యం లభిస్తుంది. దీనిని ఎక్స్‌పెంగ్ ఎర్హోట్ కంపెనీ తయారు చేసింది. యెల్లో రివర్‌పై ఈ ఫ్లయింగ్ కారును చూసి ప్రజలు చాలా ఆసక్తికి గురయ్యారు. ఇప్పటివరకు కేవలం రోడ్లపైనే తిరిగే కార్ల రూపురేఖలను ఈ ఫ్లయింగ్ కారు మారుస్తుందని భావిస్తున్నారు.

ఫ్లయింగ్ కార్లు అనేవి కేవలం ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో కొత్త ఉత్సాహాన్ని అందించడంతో పాటు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడానికి ప్రజల సమయాన్ని కూడా తగ్గిస్తుందని కంపెనీ అంటోంది. భూమికి 300 మీటర్ల దూరంలో ఈ ఫ్లయింగ్ కార్ ఎగిరి మొదటి టెస్టును పాస్ అయ్యింది. ఇప్పటికే ఫ్లయింగ్ కారును తయారు చేయాలనే ఐడియా చాలా ప్రపంచ దేశాలకు ఉంది. వాటికంటే ముందుగా దీనిని తమ టూరిజం కోసం తయారు చేసి ట్రెండ్ అవ్వాలని చైనా సన్నాహాలు మొదలుపెట్టిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×