E-Paper
Advertisement

Gastric Problem: పొట్టలో గ్యాస్ ఇబ్బందా.. భోజనం తరువాత ఇలా చేయండి..

Gastric Problem: మీరు భోజన ప్రియులా.. విందు భోజనంలో ఫ్రైలు, వంటలు, బిర్యానీలు, మసాలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారా.. అయితే ఆ తరువాతే అసలైన సమస్య మోదలవుతుంది.

Gastric Problem: పొట్టలో గ్యాస్ ఇబ్బందా.. భోజనం తరువాత ఇలా చేయండి..
Advertisement

Gastric Problem: మీరు భోజన ప్రియులా.. విందు భోజనంలో ఫ్రైలు, వంటలు, బిర్యానీలు, మసాలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారా. అయితే ఆ తరువాతే అసలైన సమస్య మొదలవుతుంది. కడుపులో గ్యాస్, మంట, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు వెంటాడుతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని ఆహారాలను, పానీయాలను తీసుకుంటే సరిపోతుంది.

పెరుగు: పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఎసిడిటీని తగ్గిస్తుంది. భోజనం తరువాత పెరుగు తీసుకుంటే మంచిది. ఆయుర్వేదం కూడా అదే చెబుతుంది. పెరుగుతో పాటు కాస్త జీలకర్ర తీసుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది.

Advertisement

వేడి నీళ్లు: గోరువెచ్చని నీరు జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తాయి. మీకు ఇష్టమైన స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మలబద్ధకం సమస్య రాకుండా గోరువెచ్చని నీటిని తాగండి. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

గ్రీన్ టీ: మీకు టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే వాటి స్థానంలో గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. జీర్ణవ్యవస్థలో ఆక్సీకరణ భారాన్ని సమతుల్యం చేయడానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీని వలన ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

Advertisement

వాము: అసిడిటీకి మంచి పరిష్కారం వాము. గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూన్ వాములో కాస్త జీలకర్ర వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని తాగితే అసిడిటీకి చెక్ పెట్టొచ్చు.

ఫైబర్: ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కడుపుని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన తరువాత ఓట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, వేరుశెనగ, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్యూట్స్‌ తినడం మంచిది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×