BigTV English

Essential prices : పెరిగిన నిత్యావసర ధరలు.. నోటికి అందని రుచి..

Essential prices : పెరిగిన నిత్యావసర ధరలు.. నోటికి అందని రుచి..

Essential prices : నిత్యావసర వస్తువుల ధరలు నింగిని అంటుతున్నాయి. కూరగాయల ధరలు కొనేలా లేవు. నోటికి రుచిగా.. కడుపునిండా భోజనం చేయడం సాటి మధ్యతరగతి కుటుంబానికి కలే అయ్యేలా ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు చూస్తే.. మీక్కూడా ఇలాగే అనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు పంటల దిగుబడిని తగ్గించాయి. చేతికి పంట అందివచ్చే సమయంలో.. పంటలు వర్షార్పణమయ్యాయి. దాంతో కూరగాయలతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.


బియ్యం ధరలు రోజుకొకలా పెరుగుతున్నాయి. నవంబర్ లో సోనామసూరి బియ్యం కిలో రూ.65 ఉండేది. డిసెంబర్ నాటికి కిలో రూ.75 అయ్యింది. జనవరి లో కిలో రూ.80 కి పెరిగింది. ప్యాకింగ్ , రవాణా ఛార్జీలతో క్వింటా బస్తా బియ్యం ధర రూ.6500 నుంచి రూ.7000 వరకు పలుకుతుంది. రిటైల్ షాపుల్లో రూ.75 నుంచి రూ.80 వరకూ ఉంది. విజయ మసూరి బియ్యం క్వింటా బస్తా ధర రూ.5900 నుంచి రూ.6300 వరకూ పలుకుతోంది.

కూరగాయలు ధరల విషయనికి వస్తే కిలో రూ.80కి పైగా ఉన్నాయి. పండగలు, వేడుకలు,పెళ్లిళ్లు ఉండటంతో నాన్ వెజ్ ధరలు కూడా బాగా పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో 5 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయింది. లైవ్ కోడి ధర రూ.140 ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.240 కి చేరింది. మటన్ కిలో రూ.820 ఉంది. బోన్ లెస్ మటన్ కిలో రూ.1020 అయ్యింది. కోడిగుడ్ల ధరలు డజన్ రూ.75 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు ఇలా పెరుగుతూ ఉంటే.. ఇంకేం తినాలని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×