E-Paper
Advertisement

Diamonds Research:వజ్రాలపై పరిశోధనలకు రూ.242 కోట్ల బడ్జెట్..

Diamonds Research:వజ్రాలపై పరిశోధనలకు రూ.242 కోట్ల బడ్జెట్..
Advertisement

Diamonds Research:భూమిలో పెరుగుతున్నదాని దగ్గర నుండి ఆకాశంలో ఎగురుతున్నదాని వరకు శాస్త్రవేత్తలు అన్నింటిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అంతే కాకుండా నేచురల్‌గా పుట్టుకొస్తున్న ప్రతీదానికి ఆర్టిఫిషియల్‌ ప్రింట్‌ను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా వజ్రాలపై కూడా కొత్త పరిశోధనలు మొదలుపెట్టారు పరిశోధకులు.

తాజాగా కేంద్రం బడ్జెట్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పటికీ పలు సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు అసంతృప్తిగానే ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం పరిశోధన విషయంలో అభివృద్ధి చెందాలనుకుంటున్న రంగాలకు కూడా ఇది కొత్త ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ల్యాబరెటరీలో పెరిగిన వజ్రాలపై పరిశోధనలు చేయడానికి కూడా మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రూ.242 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. అయిదేళ్ల పాటు వజ్రాలపై పరిశోధనలు చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడనుంది.

Advertisement

ఈ బడ్జెట్ కేవలం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మాత్రమే కాకుండా ఈ పరిశోధనల్లో భాగమయ్యే ప్రతీ ఒక్కరికి అందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ఇన్సెంట్ ఎల్జీడీ) గత రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో పరిశోధనలు చేస్తూనే ఉంది. అంతే కాకుండా డైమండ్ రీసెర్చ్‌లో టెక్నాలజీ పరంగా ఎంతో సాయం చేసింది. అంతే కాకుండా స్పేస్, డిఫెన్స్ విభాగాలకు కూడా తన సాయాన్ని అందించింది.

మామూలుగా తయారు చేసిన డైమండ్స్ కంటే ల్యాబరటరీ గ్రోన్ డైమండ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. వాటిని క్వాలిటీని కనుక్కోవడానికి ప్రత్యేక పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంటుందని వారు తెలిపారు. ఈ రంగంలో చేసే పరిశోధనలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమని, అంతే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న పని అని వారు బయటపెట్టారు. దీనికోసం ఇతర దేశాల నుండి ధర ఎక్కువైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×