E-Paper
Advertisement

NISAR:-నిసార్ కోసం చేతులు కలిపిన నాసా, ఇస్రో..

NISAR:-నిసార్ కోసం చేతులు కలిపిన నాసా, ఇస్రో..
Advertisement

NISAR:- సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఎంత పోటీ ఉంటుందో.. అంతే సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి. ఎంత పోటాపోటీగా ముందుకు వెళ్లినా కూడా ఇతర దేశాల సాయం తీసుకోకుండా అద్భుతమైన పరిశోధనల్లో విజయం సాధించడం ఒక్కొక్కసారి అసాధ్యంగా మారుతుంది. అందుకే ఎప్పుడూ పోటాపోటీగా ఉండే నాసా, ఇస్రో సైతం ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. అదే నిసార్ శాటిలైట్.

నాసా, ఇస్రో.. స్పేస్ పరిశోధనల్లో ఈ రెండు సంస్థలు ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతుంటాయి. స్పేస్ పరిశోధనల కోసం అమెరికా దగ్గర ఉన్నంత వనరులు ఇండియాలో లేకపోయినా.. నాసాకు ఏ మాత్రం తీసిపోకుండా ఇస్రో సక్సెస్ రేట్ ఉంది. అందుకే ఈ రెండు కలిసి చేసిన పరిశోధనలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే ఇంతకు ముందు చేసినవాటి కంటే మరింత భారీగా నిసార్ శాటిలైట్ అనే కొత్త ప్రాజెక్ట్‌ను కలిసి ప్రారంభించారు నాసా, ఇస్రో.

Advertisement

నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్.. షార్ట్‌కట్‌లో నిసార్. ఇదొక ఎర్త్ సైన్స్ శాటిలైట్. ఈ శాటిలైట్ గురించి యూనియన్ మినిస్టర్ స్వయంగా రాజ్యసభలో ప్రకటించారు. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ (ఎల్ అండ్ ఎస్ బ్యాండ్‌)తో ఈ శాటిలైట్‌ను డిజైన్, డెవలప్, లాంచ్ చేయడమే నాసా, ఇస్రో ముఖ్య లక్ష్యమని తెలుస్తోంది. ఇదొక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌గా ఏర్పాటు కానుంది. సర్ఫేస్ డిఫార్మేషన్ స్టడీస్, టెర్రెస్టెరియల్ బయోమాస్ స్ట్రక్చర్, నేచురల్ రీసౌర్స్ మ్యాపింగ్ అండ్ మానిటరింగ్ వంటి విషయాల్లో ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది.

నిసార్ శాటిలైట్ ఒక ఐ 3కే బస్ ద్వారా ఏర్పాటు చేయబడనుంది. సార్ టెక్నిక్‌ను ఉపయోగించే ఒక సార్ పరికరం కూడా ఇందులో ఉండనుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్స్ రెండింటిలోనూ ఈ సార్ టెక్నిక్ ఉపయోగపడనుంది. ఇది సూర్యుడితో పాటు సమానంగా ఆర్బిట్‌లో తిరగగలిగే సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. నిసార్‌లో ఎల్ బ్యాండ్ సార్ పేలోడ్, జీపీఎస్, యాంటినా వంటి ఫీచర్స్‌ను ఏర్పాటు చేయడం నాసా బాధ్యత.

Advertisement

నిసార్ శాటిలైట్ తయారీలో ఇస్రోకు కూడా కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. ఎస్ బ్యాండ్ సార్ పేలోడ్, స్పేస్‌క్రాఫ్ట్ బస్, లాంచ్ ఏర్పాట్లు అనేవి ఇస్రో చూసుకోవాల్సి ఉంటుంది. 2023 ఫిబ్రవరీలో నిసార్ కోసం ఇస్రో రూ.469.40 కోట్ల పెట్టుబడిని పెట్టింది. లాంచ్ కాస్ట్‌లతో కలిపి ఇంకాస్త ఎక్కువ ఖర్చే చేసింది. అయితే నిసార్ శాటిలైట్ అటు నాసాకు, ఇటు ఇస్రోకు గర్వకారణంగా మారుతుందని నిపుణులు ధృడంగా భావిస్తున్నారు.

ఆకాశాన్ని కమ్మేస్తున్న శాటిలైట్లు.. ప్రమాదాల హెచ్చరిక..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×