E-Paper
Advertisement

Vastu For Home Windows: ఇంటి కిటీకీలు వాస్తులో అసలు విషయం

Vastu For Home Windows: ఇంటి కిటీకీలు వాస్తులో అసలు విషయం

Vastu For Home Windows : ఇంటికి తలుపులతోపాటు కిటికీల విషయంలో వాస్తు కచ్చితంగా పాటించాలంటోంది శాస్త్రం. ముఖ్యంగా కిటికీలు సరి సంఖ్యలో ఉండాలన్నది అందరూ చెప్పే మాటే. కానీ అది సున్న వచ్చే విధంగా అస్సలు ఉండకూడదు. అంటే పది, ఇరవై, ముప్పై ఇలా అన్నమాట. ఇండిపెండెంట్ అయినా బహుళ అంతుస్థులైనా ఏ అంతస్థుకు అదే లెక్క పెట్టుకోవాలి. ఫ్లాట్ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏ ఫ్లాట్ కు ఆ ఫ్లాట్ లోనే కిటికీల లెక్క చూసుకోవాలి. కిటీకీలు ఏర్పాటు చేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. పారు తప్పకుండా చూసుకోవాలి. కిటికీ ఎదురుగానే కిటికీ ఉండాలనీ క్రాస్ గా రాకూడదు. కిటికీ ఎదురుగా కిటికీ రాకపోయినా ఒక్కోసారి పర్వాలేదు కానీ క్రాస్ అయ్యే విధంగా మాత్రం పెట్టుకోకూడదు.

కిటీకీకి పట్టుకునే తలుపులు లోపల నుంచైనా పెట్టుకోవచ్చు. లేదా బయటి నుంచైనా పెట్టుకోవచ్చు. కొంతమంది లోపల మాత్రమే కిటికీ తలుపులు లోపల మాత్రమే ఉండాలని అంటూ ఉంటారు. గోడలో కిటీకీని నిలబెట్టేటప్పుడు కూడా పద్దతి పాటించాలి. గోడ మందంలో సగానికి విండోని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కిటికీని గోడ చివరకి వచ్చేటట్టు ఈ రోజుల్లో పెడుతున్నారు. కానీ అది శాస్త్ర సమ్మతం కాదంటోంది. గోడ మధ్యలోనే కిటికి నిలబెట్టేలా చూసుకోవడం ఉత్తమం.

వెంటిలేటర్ల విషయానికి వస్తే అవి కిటికీలతో సమానంగా ఉండాల్సిన పనిలేదని శాస్త్రం చెబుతోంది. వెంటిలేటర్ల సంఖ్యకు ఎలాంటి లిమిట్ లేదు. సరి సంఖ్యలో ఉండాలన్న నియమం కానీ, బేసి సంఖ్యలోనే పెట్టాలన్న నియమం కానీ లేదు . నేల నుంచి ఐదు అడుగులపైనే పెట్టేది ఏదైనా వెంటిలేటర్ గా లెక్కించాలి. అలాగే గోడల లోపల వెంటిలేటర్ పెట్టేటప్పుడు గోడకి అంచుకి రాకుండా చూసుకోవాలి. గోడ మధ్యలోనే వచ్చేలా ఏర్పాటు చేయాలి. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి భాగంలో కిటీకీలు కానీ వెంటిలేటర్లు కానీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. నైరుతి భాగం ఎప్పుడూ మూత పడి ఉండాల్సిన భాగమన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. లైట్ వెంటిలేషన్ కోసం ప్రయత్నించడం సరికాదని శాస్త్రం చెబుతోంది. ప్రతీ గదిలోను నైరుతి భాగంలో కిటీకిలు, వెంటిలేటర్లు పెట్టుకోకుండా జాగ్రత పడితే సరిపోతుంది.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×