E-Paper
Advertisement

ఇప్పటి వరకూ ఎంత బంగారం వెలికితీశారు?.. పసిడి గురించి ఆసక్తికర విషయాలు

ఇప్పటి వరకూ ఎంత బంగారం వెలికితీశారు?..  పసిడి గురించి ఆసక్తికర విషయాలు
Advertisement

Gold Interesting Facts: బంగారం అంటే ఆడంబరం. పెళ్లి, పేరంటం ఏదైనా సరే ఒంటిపై బంగారం ఉండాల్సిందే. ఎల్లో మెటల్ మెడలో మహిళలు మురిసిపోతారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు భారీగా ఉన్నాయి. అసలు బంగారం గురించి మనకు పూర్తిగా తెలుసా? గోల్డ్ గురించి మనం ఎప్పుడూ వినని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

1.ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న బంగారం మొత్తాన్ని 5 మైక్రాన్ల మందం ఉన్న తీగగా మార్చి సాగదీస్తే, అది ప్రపంచం చుట్టూ 11.2 మిలియన్ల సార్లు చుట్టేయగలదు.

Advertisement

2.బంగారం 2808 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఆవిరిగా మారిపోతుంది. గోల్డ్ 1064 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కరగడం స్టార్ట్ అవుతుంది.

3.మానవుల శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్. బంగారం ధరించినప్పుడు అది శరీర ఉష్ణోగ్రతను చాలా వేగంగా గ్రహిస్తుంది. బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగించడానికి ఇదో ముఖ్యకారణం.

Advertisement

4. ఐదు క్యారెట్ల వజ్రం దొరుకుంది కానీ… ఒక ఔన్స్ బంగారు ముద్ద దొరకడం చాలా అరుదు.

5.సివిలైజేషన్ సార్ట్ అయినప్పటి నుంచీ సుమారు 1,87,200 టన్నుల బంగారం బయటపడింది.

6.1885లో ఇల్లు కట్టుకోవడానికి రాళ్లు తవ్వుతుండగా, ఆస్ట్రేలియన్ గని కార్మికుడు జార్జ్ హారిసన్ దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలో బంగారం గని కనుగొన్నాడు. దీంతో అప్పటి నుంచి దక్షిణాఫ్రికాలో బంగారం వేట మొదలైంది.

7.ఇప్పటివరకు తవ్విన బంగారం మొత్తం 22 క్యూబిక్ మీటర్ల పెట్టెలో సరిపోతుంది. ఇప్పటి వరకూ వెలికితీసిన బంగారంలో దాదాపు సగం ఆభరణాలుగా తయారు చేయడానికి వాడారు.

8.ఒక క్వాడ్రిలియన్‌కు కేవలం 10 వంతుల బంగారం చొప్పున లెక్కించినా కూడా, ప్రపంచ మహాసముద్రాలలో 15,000 టన్నుల వరకు బంగారం ఉందని నిపుణుల అంచనా.

9.ఒక ఔన్సు బంగారాన్ని 50 మైళ్ల పొడవుగా సాగదీయవచ్చు. ఈ తీగ వెడల్పు ఐదు మైక్రాన్ల వెడల్పు వరకు ఉంటుంది.

10. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 5,30,000 బంగారు కడ్డీల రూపంలో 6,700 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది.

Also Read:  ఆర్బీఐ కొత్త గోల్డ్ లోన్ రూల్స్.. ఇక తక్కువ బంగారంపై ఎక్కువ లోన్ పొందవచ్చు

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×