E-Paper
Advertisement

అద్దాల మేడలపై ప్రేమ.. పేదలపై నిర్లక్ష్యం.. బాబుపై రజిని ఫైర్!

అద్దాల మేడలపై ప్రేమ.. పేదలపై నిర్లక్ష్యం.. బాబుపై రజిని ఫైర్!
Advertisement

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని ఇటీవల కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు.

అమరావతిపై ప్రేమ.. ప్రజలపై నిర్లక్ష్యం

Advertisement

చంద్రబాబుకు అమరావతిలోని అద్దాల మేడలపై ఉన్న మక్కువ, సామాన్య ప్రజల ఆరోగ్యం , విద్యపై లేదని రజిని విమర్శించారు. కేవలం అమరావతి అద్దాల కోసమే రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడం దారుణమని, ఆ నిధులను మెడికల్ కాలేజీలకు లేదా ఆరోగ్యశ్రీకి మళ్లించి ఉంటే ఎంతో మందికి మేలు జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, అడుగుకు రూ. 18,500 పైగా ఖర్చు చూపడం అవినీతికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు.

పెన్షన్ల కోత

Advertisement

గత రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, సుమారు 6 లక్షల పెన్షన్లను అన్యాయంగా తొలగించారని రజిని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని పెన్షన్లు కట్ చేస్తున్నారని, 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదల సంక్షేమం దగ్గరకు వచ్చేసరికి నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 4,000 కోట్లకు చేరాయని, నెట్‌వర్క్ ఆసుపత్రులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే స్థితికి ప్రభుత్వం దిగజారిందని రజిని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రతి వర్గానికి మేలు జరిగిందని, కానీ నేడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ముతో విమానాలు, హెలికాప్టర్లలో విలాసాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని, ఎన్టీఆర్ నుంచి రంగా వరకు జరిగిన ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read: ఆగ్రహంతో ఊగిపోయిన మల్లారెడ్డి.. నేను ఎమ్మెల్యేనా? కానా? అంటూ.. అధికారులపై ఫైర్!

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×