Husband Name : ఒకప్పుడు భార్యలు భర్తలను పిలవడానికి భయపడేవారు. తర్వాత కాలంలో బావగారు, ఏంటయ్యా, ఏమయ్యా, జి, హాజీ అని పిలిచేవారు. ఆ పరిస్థితులు అన్నీ మారిపోయాయి . ఇప్పుడైతే కొంతమంది భర్తలను అరేయ్, ఒరేయ్,ఇటు రారా, అటు పోరా అంటూ పిలుస్తున్నారు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది చాలా తప్పు అని అంటున్నారు. ఏ భర్తని అయినా సరే భార్య పేరు పెట్టి అసలు పిలువకూడదట. ఇలా పిలవడం అమర్యాదకరం, అలాగే నలుగురిలో భర్త యొక్క విలువను తగ్గించడమేనని భావిస్తుంటారు.
హిందూ సంప్రదాయ ప్రకారం పెద్దవాళ్లను పేరు పెట్టి పిలవకూడదు. అలా పిలిస్తే వారికి ఆయుః క్షీణం వస్తుందని నమ్మకం. అందుకే చిన్నోళ్లు పెద్దోళ్లను పేరుతో పిలిచే వారు కాదు . సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు భర్త వయసు ఎక్కువ, భార్య వయసు తక్కువ ఉండేలా చేస్తారు. వయసు రిత్యా పెద్దవాడు కాబట్టి ఆమె భర్తను పేరుతో పిలవకూడదని ఆరోజుల్లో మన పెద్దోళ్లు చెప్పారు.
ఇంట్లో ఏకాంతంగా ఉండేటప్పుడు ఎలా మాట్లాడుకున్నా..నలుగురిలో ఉన్నప్పుడు పద్ధతులు పాటించడం మంచిదని చెబుతున్నారు. పేరు పెట్టి పిలవకుండానే ఏవండీ అని పిలిస్తే మర్యాదగా ఉంటుంది. గతంలో అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచేవారు. ఉదాహరణకు గౌతమీపుత్ర అని పిలిచేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
మీ అత్తమామలు వారి కొడుకును పేరు పెట్టి పిలవడం అస్సలు ఇష్టపడరు. వారిని కూడా కన్విన్స్ చేశాకే మీ భర్తను పేరు పెట్టి పిలవండి అని కొంతమంది హిందూ సాంప్రదాయ నిపుణులు తెలియజేస్తున్నారు