Marriages : హిందూమతంలో సంప్రదాయాలన్నీ దూరదృష్టితో మొదలుపెట్టినవే. ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లగానే తన పుట్టింటితో అనుబంధమూ, హక్కులూ పోయాయని, దూరమయ్యాయని బాధపడుతుంటుంది. అలాంటిదేమీ లేదు ఈ ఇంట్లో నీ హక్కు అలానే ఉందని చెప్పడానికి ఆడపడుచు స్థానాన్ని ఆచారపూర్వకంగానే భద్రపరిచే నియమాలు పెట్టారు. ఇంట్లో జరిగే శుభకార్యాలలో ఆడపడుచుకు అగ్రస్థానం కల్పించారు. దీన్ని బట్టి మనపూర్వికలకు ఎంత దూర దృష్టి ఉందో గుర్తించండి.
ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆమే లక్ష్మిదేవి తో సమానం. అలాంటి ఆడపిల్ల పెళ్ళి సమయంలో సంతోషంగా ఇంట్లో తిరుగుతు ఉండాలని, వరుడు తన సోదరిని సంతోషపేట్టడానికి ఇచ్చే కానుక ఆడపడుచు లాంచనం. అదే మనం పిలిచే ఆడపడుచు కట్నం. అది వరుని ఇంట్లో పెద్దవాళ్ళో లేక వరుడో తన సోదరికి ఇవ్వాలి.
వివాహ సమయంలో తోడపుట్టిన వాడిని పెళ్లి కొడుకును చేయించటం దగ్గర నుంచి అమెకు లాంఛనాలు ఇప్పించటం వరకూ తన ఇంటి పిల్లగానే ప్రాధాన్యత కల్పిస్తారు.
అలాగే తాము పోయిన తర్వాత కూడా ఆడపిల్లను సోదరులు పట్టించుకోరేమోనని ముందు ప్రతీ శుభకార్యానికి ఆడపిల్ల తప్పని సరి అని ఆమె చేతుల మీదగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. ఆడపిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చేసినా పుట్టింటతో ఆమె బంధం ఎప్పటికీ కొనసాగాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అందులో భాగమే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆడుపడుచును ప్రత్యేకంగా బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తారు. శుభకార్యానికి అందరికంటే ముందే కబురు పంపుతారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు కూడా వీలైనంత వరకు ఆడపడుచును సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు .
కూతురికి పెళ్లి సంబంధం చూసే టప్పుడు తల్లిదండ్రులు అబ్బాయికి అవివాహిత అక్క ఉందా? అని ప్రత్యేకంగా విచారణ చేస్తారు. ఎందుకంటే ఆమె ఇంట్లో ఉంటే తప్పకుండా అంతా తనదే నడుస్తూ ఉంటుంది