BigTV English

Good Days: ఆ రోజు పెరుగన్నం దానం చేస్తే మంచిరోజులు మొదలైనట్టే….

Good Days: ఆ రోజు పెరుగన్నం దానం చేస్తే మంచిరోజులు మొదలైనట్టే….

Good Days:సిద్ధి వినాయకస్వామిని స్వర్ణ గౌరిని నీటిలో వదిలే సమయంలో పెరుగన్నం నైవేద్యంగా చేసి తిన్నా-దానం చేసినా మీ ఇంట్లో ప్రశాంతత, శాంతి, సంతోషం నెలకొంటాయని పండితులు అంటున్నారు. అలాగే అమావాస్య రోజు, మహాలయ పక్షాల సమయంలో పెరుగన్నం దానం చేస్తే అన్ని పితృశాపాలు తొలగిపోతాయి. అలాగే కులదేవతలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సుఖసంతోషాలు
కలుగుతాయి. శనివారం రోజు కులదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంట్లో అప్పుల బాధల నుంచి విముక్తి చెందుతారు. పెరుగు అన్నాన్ని దానిమ్మ పండు గింజలను కలిపి కులదేవతలకు నైవేద్యం చేసి, దానం చేస్తే శత్రువుల బాధ తొలగిపోతుంది. శుక్రవారం, శనివారం సాయంత్రం పూట మాత్రమే ఇలా పెరుగు అన్నాన్ని స్వీకరించాలి


శనివారం రోజు స్టీలు పళ్లెంలో అరటి ఆకు ఉంచి పెరుగన్నం పెట్టి, పళ్లెంతో సహా తాంబూలంతో కలిపి దానం చేస్తే ఎముకల సమస్యలతోపాటు అన్ని రకాల మోకాళ్ల నొప్పులు త్వరగా నయమవుతాయి. శ్రావణమాసంలో శ్రీ మహా లక్ష్మీదేవికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే ధన వృద్ధి కలుగుతుంది.. శ్రావణ శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి పూజను చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంతో పెరుగన్నాన్ని దానం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి రాక పుంజుకుంటుందని పురోహితులు అంటున్నారు.

ఆషాడమాసంలో కూడా అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. ముందు రోజే అన్నంలో పాలు పోసి పెరుగు తోడంటు వేసి ఉదయం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి. పూజ చేసిన తర్వాత ఆ అన్నాన్ని ఇంటి యజమాని తిని ఇంటి చాకలి కూడా ఇస్తుంటారు. అలా చేయడం వల్ల కడుపు చలువ అంటారు. అది కూడా ఆదివారమే చేయాలి. దీని వల్ల సంతానం చల్లగా ఉంటారు. కలకాలం ఆరోగ్యంగా ఉంటారు.


Tags

Related News

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Big Stories

×