BigTV English

Income Tax Dept: ఐటీ శాఖలో ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ పోస్టులు

Income Tax Dept: ఐటీ శాఖలో ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ పోస్టులు

Income Tax Dept: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్ స్పోర్ట్స్ కోటా కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో), టాక్స్ అసిస్టెంట్ (టీఏ), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌), క్యాంటీన్ అటెండెంట్ (సీఏ) పోస్టులను భర్తీ చేస్తోన్నారు. ఈ పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతున్నారు.


మొత్తం ఖాళీలు: 291.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా – పాట్యా, బాల్-బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బేస్ బాల్, నెట్ బాల్, పవర్ లిఫ్టింగ్, పోలో, బాక్సింగ్, క్యారమ్, బ్రిడ్జ్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, క్రికెట్, పెన్కాక్ సిలాట్, బిలియర్డ్స్ & స్నూకర్స్, షూటింగ్, బాడీ-బిల్డింగ్, షూటింగ్ బాల్, రోల్ బాల్, వంతెన, రోలర్ స్కేటింగ్, రోయింగ్, రగ్బీ, సెపక్ తక్రా, సాఫ్ట్ బాల్, సైకిల్ పోలో, సాఫ్ట్ టెన్నిస్, డెఫ్ స్పోర్ట్స్, స్క్వాష్, ఈక్వెస్ట్రియన్, ఈత, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, గోల్ఫ్, టెన్ని-కోయిట్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్, హ్యాండ్‌బాల్, టెన్పిన్ బౌలింగ్, హాకీ, ట్రయాథ్లాన్, ఐస్-హాకీ, టగ్-ఆఫ్-వార్, ఐస్-స్కేటింగ్ 59 వాలీబాల్, ఐస్-స్కీయింగ్, వెయిట్ లిఫ్టింగ్, జూడో, వుషు, కబడ్డీ, రెజ్లింగ్, కరాటే, యాటింగ్, కయాకింగ్ & కానోయింగ్, టెన్నిస్ బాల్ క్రికెట్, ఖో-ఖో, యోగాసనం, కూడో వంటి క్రీడలలో ప్రతిభావంతులై ఉండాలి.


అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

వయోపరిమితి: 01-01-2023 నాటికి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు 18 నుంచి 30 ఏళ్లు. స్టెనోగ్రాఫర్‌కు 18 నుంచి 27 ఏళ్లు. టాక్స్ అసిస్టెంట్‌కు 18 నుంచి 27 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 18 నుంచి 25 ఏళ్లు. క్యాంటీన్ అటెండెంట్‌కు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా.

వేతనాలు: నెలకు క్యాంటీన్ అటెండెంట్/ ఎంటీఎస్‌లకు రూ.18,000 నుంచి 56,900. స్టెనోగ్రాఫర్/ ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 నుంచి 81,100. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు రూ.44,900 నుంచి 1,42,400 చెల్లించనున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2024.

నోటిఫికేషన్ కోసం ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాలి.

Tags

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×